వడ్డేపల్లి, నవంబర్ 7 : ఆటో, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెం దిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా జూలేకల్ స్టేజీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన మహేశ్ (20), విశ్వాస్(18) ఇద్దరు యువకులు ఆటోలో టమాటలను తీ సుకొని శాంతినగర్లో విక్రయించి తిరిగి వెళ్తుండగా జూలేకల్ స్జేజీ సమీపంలోని గిజ్జిగాని లంప వద్ద తమిళనాడుకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో ఆటో నుజ్జునుజ్జు కాగా ఆటోలో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
సీఐ టాటాబా బు, ఎస్సై నాగశేఖర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆటోను ఢీ కొట్టిన టిప్పర్ను స్టేషన్కు తరలించి డ్రైవర్ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ దవఖానకు తరలించారు.