అలంపూర్ : అలంపూర్ (Alampur) మండలంలోని జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం మానవపాడు స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) ఇద్దరు మృతి చెందారు. స్థానిక ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ముందుకు వెళుతున్న లారీని మరో లారీ వెనుకవైపు నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లారీ ఓనర్ కం డ్రైవర్ షేక్ హుస్సేన్ భాష (56), క్లీనర్ ఈరన్న (58 ) మృతి చెందినట్టు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.