మహబూబ్‌నగర్, నవంబర్ 13 : పాత భవనం కూలిపోయి ఇద్దరు కూలీలు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. వివరాలిలా ఉన్నా యి. గురువారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కూరగాయల మా ర్కెట్ సమీపంలో లక్ష్మణ్ తన పాత ఇంటిని కూల్చేందుకు స్థానిక అడ్డాపైన కూలీలను మాట్లాడుకొని గురువారం పనికి తీసుకెళ్లాడు. అయితే పాత గోడలను కూల్చే క్రమంలో చెట్టును తొలగించేందుకు అడ్డుగా ఉన్న గోడను మిషన్‌తో డ్రిల్ చేస్తుండగా.. అకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది.
ఈ ధాటికి మట్టి గోడ ఒక్కసారిగా కూలి వీరిపై పడింది. క్షణాల్లోనే ఇద్దరు కూలీలు ప్రమాద స్థలంలోని మరణించారు. మృతుల్లో జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన కృష్ణయ్య (45) నవాబ్‌పేట మండ లం రుద్రారంలో నివసిస్తున్నాడు. శిథిలాల కింద మరొకరు ఉండొచ్చని అనుమానం వ్య క్తం చేస్తున్నారు. అయితే మరో కూలి స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. దాదాపు 3 గంటల తర్వాత శిథిలాలల నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. విష యం తెలుసుకొన్న కలెక్టర్ విజయేందిరబో యి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విష యం తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ యంత్రాంగం నగర పాలక సంస్థ, అగ్నిమాపక శాఖ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా అగ్నిమాపక అధికారి కిశోర్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌రెడ్డి, వన్ టౌన్ సీఐ అప్పయ్య దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శిథిలాలు యుద్ధ ప్రాతిపదికన తొలగించే పనులు ప్రారంభించారు.