మహ్మదాబాద్/హన్వాడ, డిసెంబర్ 8 : నీటి గుంతలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘట న మహబూబ్నగర్ జిల్లాలో వేర్వేరు చోట్ల చేసుకు న్నాయి. గండీడ్ మండలం రుసుంపల్లి గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య కూతురు హన్షిక(5) స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్నది. ఆదివారం సెలవు కావడంతో పొలం వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు హన్షిక బోరు పక్కన ఉన్న నీటి గుంతలో పడింది. బాలిక అన్న హర్షవర్ధన్ ఏ డ్చుకుంటూ తల్లిదండ్రుల వద్దకు పరుగులు తీశాడు. తల్లిదండ్రులు వచ్చి చూ సే సరికి బాలిక అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
హన్వాడ మండలంలోని సల్లోనిపల్లికి చెందిన కేశవులు కూతురు వైష్ణవి(7)తన పొలం దగ్గర ఆడుకుంటూ ప్రమాదశాత్తు కాలు జారి నీటి నిల్వ కోసం తీ సిన గుంతలో పడింది. వెంటనే తల్లి గుంతలోకి దిగి వెతికి బయటకు తీయగా బాలిక అప్పటికే మృతి చెందింది. కండ్ల ముందే చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.