నారాయణపేట : నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి (Two children die) చెందిన విషాద ఘటన నారాయణపేట ( Narayanapet ) జిల్లా ఊట్కూరు మండలం తిమ్మారెడ్డిపల్లి తండాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుణ్య నాయక్, జయ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాదుకు వెళ్లారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా ఇద్దరు కుమారులు ఆకాష్(4), అభి (3 ) హైదరాబాదు నుంచి మంగళవారం తండాకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం మరుగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన నీటి గుంతలో పడి చనిపోయారు. తమ చిన్నారులు కనిపించడం లేదని తల్లిదండ్రులు గాలించగా నీటిసంపులో మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతదేహాలను చూసి తల్లిదండ్రుల రోదనులు మిన్నంటాయి.