ఊట్కూర్, సెప్టెంబర్ 3 : నీటి గుంతలో పడి ఇద్దరు గిరిజన చిన్నారులు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మం డలం తిమ్మారెడ్డిపల్లి తండాలో చోటు చేసుకున్నది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకా రం తండాకు చెందిన పునియానాయక్, జ యమ్మ దంపతులు కొన్నాళ్లుగా బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటున్నా రు. గ్రామంలో జరిగే వినాయక చవితి నిమజ్జనం వేడుకల్లో పాల్గొనేందుకు రెండు రోజుల కిందట తండాకు చేరుకున్నా రు.
పునియానాయక్, జయమ్మల కుమారులు అభి (5), ఆకాశ్ (4) బుధవారం మధ్యాహ్నం పక్క ఇం టి ఖాళీ స్థలంలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం తీసిన నీటి గుంతలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. స్థానికులు చిన్నారులను బయటి తీయగా అప్పటికే మృతి చెం దినట్లు తెలిపారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటగా తండాలో తీవ్ర విషాదం నెలకొంది.