బిజినేపల్లి : పిడుగుపాటుకు (Lightning strike ) రెండు కాడెద్దుల ( Bulls ) మృతి చెందిన సంఘటన
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీశైలం అనే రైతు ప్రతినిత్యం లాగానే పొలంలో తన పనులు ముగించుకున్న తర్వాత రెండు ఎద్దులను తాడుతో చెట్టుకు కట్టి ఇంటికి వెళ్లిపోయాడు. అదే సమయంలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు సమీపంలో పిడుగు పడడంతో ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయన్నారు. రెండు కాడెద్దుల విలువ లక్షా 50 వేల రూపాయలు ఉంటుందని బాధితుడు వివరించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.