భూత్పూర్ : మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గర సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. రెండు ఆటోలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారు వనపర్తి జిల్లా దొంతికుంటతండాకు చెందిన వారిగా సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .