అయ్యో‘పాపం’
ఆడ శిశువును అమ్మకానికి పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం కిష్టతండాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ ధర్మానాయక్ కథనం మేరకు.. వడ్యియా లక్ష్మి, రవి దంపతులకు గతంలోనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగు రోజుల కిందట ఓ ప్రైవేటు ద వాఖానలో మళ్లీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడం.. మూడో సంతానంగా పుట్టిన కన్నబిడ్డను పోషించే స్థోమత లేకపోవడంతో శిశువును అమ్మకానికి పెట్టాలని దంపతులు నిర్ణయించుకున్నారు.
- ఆడశిశువు విక్రయానికి యత్నం
- అడ్డుకున్న సీడబ్ల్యూసీ అధికారులు
- శిశువు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 14 : ఆడ శిశువును అమ్మకానికి పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం కిష్టతండాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ ధర్మానాయక్ కథనం మేరకు.. వడ్యియా లక్ష్మి, రవి దంపతులకు గతంలోనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగు రోజుల కిందట ఓ ప్రైవేటు ద వాఖానలో మళ్లీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడం.. మూడో సంతానంగా పుట్టిన కన్నబిడ్డను పోషించే స్థోమత లేకపోవడంతో శిశువును అమ్మకానికి పెట్టాలని దంపతులు నిర్ణయించుకున్నారు.
ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అచ్చంపేట పాత బస్టాండ్లో శిశువు అమ్మకం విషయంపై రూ.2.50 లక్షల బేరం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదంతో ఈ విషయం వెల్లడైంది. ఇంటెలిజెన్స్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు సీడబ్ల్యూసీ, ఐసీడీఎస్ సభ్యులకు సూచించారు. వెంటనే స్పందించిన వారు తండాకు వెళ్లారు. సర్పంచ్ ధర్మానాయక్, పెద్ద మనుషులతో చర్చించి ఆ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి నుంచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకోవడంతో అమ్మకానికి బ్రేక్ పడిందని ఏసీడీపీవో కమల, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

