హన్వాడ : కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిర్వాకం వల్ల నిర్మాణంలో ఉన్న రోడ్డును ( Road ) అర్ధాంతరంగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ గిరిజనులు రాస్తారోకో ( Tribals protest ) నిర్వహించారు. హన్వాడ నుంచి దొరితండా రోడ్డును కాంగ్రెస్ నాయకుడు రోడ్డును ఆపారని శనివారం మహబూబ్నగర్ తాండూరు ప్రధాన రహదారిపై దొరితండ గిరిజనులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ రోడ్డు మధ్యలో ఆలయం చుట్టూ ఉన్న దిమ్మె సైజును తగ్గిస్తామని చెప్పినా కూడా రోడ్డు పనులను అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు స్పందించి రోడ్డు పనులను నిలిపి వేస్తున్న వారిపై చర్య తీసుకుని, రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు. ఈ రాస్తారోకోలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.