వనపర్తి టౌన్, నవంబర్ 2 : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం వనపర్తిలోని తన స్వగృహంలో నాయకులు, కార్యకర్తలతో ముచ్చటిస్తున్నారు. ఇద్దరు గిరిజన విద్యార్థులు వినోద్, మురళి మంత్రి వద్దకు చేరుకొని దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
దీంతో వారిని మంత్రి ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. సారూ మేము గురుకుల పాఠశాలలో చదువుతున్నామని, కేసీఆర్ పాలనలో చదువు, భోజనం, వసతులు చాలా బాగున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. మేం 6వ వార్డులోని మెట్టుపల్లితండాకు చెందిన వారమన్నారు. ఇందుకు నిరంజన్‌రెడ్డి విద్యార్థులను అభినందించి చిరుకానుక అందించారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు.