భూత్పూర్/ కోడేరు, ఏప్రిల్ 30 : భూత్పూర్ మండలంలోని గోప్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం అంజమ్మ(57)వడ దెబ్బతో బుధవారం మృతి చెం దింది. మంగళవారం వరి చేను కోత పనులకు వెళ్లి వచ్చి రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు.
మృతురాలికి ఇద్దరు కుమారులు, ఓ కు మార్తె ఉన్నారు. వారు ఇద్దరు పనులకోసం హైదరాబాద్కు వలస వెళ్లగా ఇంట్లో ఎవ రూ లేకపోవడంతో అస్వస్థతకు గురైన ఆమె మృతి చెందింది. ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్నిఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.