వనపర్తి, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను అమలు చేసి 150ఏండ్లు గా తాము సాగు చేస్తున్న వ్యవసాయ భూములను తమ పేరున పట్టాలు చేయాలని 8తండాలకు చెం దిన గిరిజన రైతులు శుక్రవారం వారి తండాల నుం చి వనపర్తి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఖిల్లాఘణపురం మండలం వెనకితండా, ముందరి తండా, మేడిబాయి తండా, బక్కతండా, కర్నెతండా, ఆముదాలబండ తండాలతోపాటు బిజినేపల్లి మండలం భీముని తండా, మిట్టతండాలకు చెందిన గిరిజన రైతులు మాజీ ఎంపీపీ కృష్ణా నాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం, పట్టాల సాధన కమిటీ ఆధ్వర్యం లో దాదాపు 24 కిలోమీటర్ల మేర తమకు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పట్టాలు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా గిరిజన రైతులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని మొరపెట్టుకున్నారు. కొన్ని దశాబ్దాల పాటు తాము సాగు చేస్తున్న భూములు రాజాబహదూర్ కరణ్‌చంద్, శ్యాంకరణ్ అనే వారి పేరిట ఉన్నాయని, ఇప్పటి వరకు తామే ఈ భూములను సాగు చేసుకొని బతుకుతున్నామన్నారు. ఈ భూ ములు మినహాయిస్తే బతుకులేదని, ఈ విషయాన్ని గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కూడా తీసుకెళ్లామన్నారు. ఎలాంటి ఆధారం లేని గిరిజన కు టుంబాల పంట నష్టం, రైతు భరోసా, పంట బీమాలాంటి ప్రభుత్వ పథకాలేవీ అందడం లేదని, దీన్ని పరిగణలోకి తీసుకొని 2019లో అప్పటి కలెక్టర్‌కు తమ సమస్యను వివరించగా, సీసీఎల్ఏకు పంప డం జరిగిందన్నారు.
అనంతరం స్థానిక తాసీల్దార్ తో విచారణ జరిపించి పూర్తి స్థాయి రిపోర్టును ప్ర భుత్వానికి పంపించారన్నారు. అయితే, 2022లో ఆర్డీవో ద్వారా రికార్డులో ఉన్నవారికి సమాచారం తెలియజేయడం, 50 ఎకరాలకు పైబడి ఉంటే సీ లింగ్ యాక్టు పరిధిలోకి వస్తుందని రాజవంశీయులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం అ ప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ల్యాండ్ సీలింగ్ యాక్టు ప్రకారం సాగులో ఉన్న గిరిజన రైతులకు ప ట్టాలు ఇవ్వాలని డిక్లరేషన్ ఇచ్చినట్లు గిరిజన రైతు లు పేర్కొన్నారు.
అయితే, ఇప్పటి వరకు ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా గిరిజన రైతులను ని ర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. రైతుల పాదయాత్రకు మద్దతు గా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెం కట్రాములు, ఆంజనేయులు, రాజు, అజయ్ మా ట్లాడుతూ.. రాజవంశస్తుల పేరును తొలగించి సా గులో ఉన్న గిరిజన రైతులకు ప్రభుత్వం పట్టాలను అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందించగా, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో నందిమల్ల అశోక్, జాత్రు నా యక్, పద్మ, నిక్సన్, పరమేశ్వర్, బాల్యా నాయక్, పీన్యా నాయక్, సక్రూ నాయక్, మద్దిలేటి తదితరు లు పాల్గొన్నారు.