గద్వాల, ఫిబ్రవరి 1: జిల్లా కేంద్రంలోని దవాఖాన పేరుకే పెద్దాసుపత్రి.. కాని అక్కడ రోగులకు అన్ని అరకొరే.. గతంలో సర్కార్ దవాఖాన అంటే నేను రాను బి డ్డో అనేస్థాయి నుంచి బీఆర్ఎస్ పాలనలో సర్కార్ దవాఖానకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వ దవాఖానకు వెళ్తే.. అన్ని వైద్యసేవలు ఉచితంగా అందుతాయ నే స్థాయికి తీసుకొస్తే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మరోసారి సర్కారు దవాఖాన అంటే నేను రాను బిడ్డో అనే స్థాయికి కాంగ్రెస్ పాలకులు దిగజార్చారు. ప్రభుత్వ ద వాఖానకు వచ్చే వారంత పేద, మధ్య తరగతి వారే.. అ క్కడ ఉచితంగా వైద్య సేవలు అందుతాయని వస్తే వై ద్యం సంగతి దేవుడెరుగు.. బయటకు రాసే మందులతో రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
ఈ విషయం ఇక్కడి పాలకులకు అధికారులకు తెలిసినా పట్టించుకునే వారు లేకపోవడంతో దవాఖానకు వచ్చే రోగులకు అరకొర మందులతో సర్దుతున్నారని.. బయటకు ఎందుకు రాస్తున్నారని వైద్యసిబ్బందిని అడిగితే ఇక్కడ సరిపడా మందులు లేవు బయట తీసుకోండంటూ నిర్లక్ష్య స హాలు ఇస్తుండడంతో రోగులు వైద్యుల తీరును తప్పు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోగులకు అవసరమైనా అన్ని టెస్టులతోపాటు అడిగినన్ని మందులు ఉచితంగా ఇచ్చేవారు.. కాని ప్రస్తుతం జిల్లా దవాఖాన లో ఆ పరిస్థితి కనిపించక పోవడంతో విధిలేని స్థితిలో రోగులు అప్పుచేసి మందులు బయట కొనుగోలు చేస్తున్నారు. రెండు వందలు పడే మెడిషన్ రూ.6వందల వరకు విక్రయిస్తున్నా ఎవరూ పట్టించుకునే వారు లేరు. జిల్లా దవాఖానలో సోమవారం ఓ పీ సుమారు 800నుంచి వెయ్యి వరకు ఉం టుంది. మిగతా సమయంలో 6నుంచి 700 వరకు ఉంటుంది. ఇన్ పేషెంట్లు వంద వరకు ఉంటారు. జిల్లా దవాఖానలో రోగులకు అందుతున్న మందులపై నమస్తే ఫోకస్..
బడ్డెట్ నిల్..
జిల్లా కేంద్రంలోని తెలంగాణ వైద్యవిధానపరిషత్ దవాఖాన ద్వారా ఇప్పటి వరకు రోగులకు అవసరమైన మందులు ఇచ్చేవారు. అయితే టీ వీవీపీ నుంచి దానికి డీఎంఈ(డైరెక్టర్ఆఫ్మెడికల్ ఎ డ్యూకేషన్)కి అప్పగించారు. డీఎంఈకి అప్పగించే సమయంలో టీవీవీపీ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయమని ఉన్నతాధికారులకు ఆదేశాలు రావడంతో అకౌంట్స్ అన్ని క్లోజ్ చేశారు. ఈ బాధ్యతలు డీఎంఈ వారు తీసుకోవాలని అదేశాలు ఉన్నప్పటికీ వారు తీసుకోక పోవడంతో రోగులకు అందించే మందులకు బడ్జెట్‌లేక అర కొర మందులు ఇస్తూ.. అన్ని ఇస్తున్నామని చెప్పుకునే ప్రయ త్నం చేస్తున్నారు. దవాఖానలో సూట్ఫ్యాక్తోపాటు కా ఫ్ సిరప్లు డెలివరీకి వచ్చిన వారికి చికిత్స అందించే స మయంలో ఇచ్చే మందులు అన్ని బయటకు రాస్తున్నా రు. రోగులు బయట వెళ్లి మందులు తీసుకొస్తే ఉన్న రే టు కన్నా ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు రోగు ల బంధువులు ఆరోపిస్తున్నారు. బయట మందులు కొ నుగోలు చేసే వారి మాటల్లో..
మందులు బయట కొనమంటుండ్రు..
నా కూతురు శిరీషను డెలివరీకి జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తీసుకొచ్చా. నొప్పులకు సంబంధించిన మందులను బయటకు రాస్తున్నారు. రోజు రూ.300 మందులు బయట కొంటున్నం. ఇదేమని డాక్టర్లు, నర్సులను ప్రశ్నిస్తే ఇక్కడ స్టాక్ లేదు.. మరి ఏమి చేయమంటిరి అని దబాయిస్తున్నారు. విధిలేని పరిస్థితిలో బయట కొంటున్నం.
– సత్యమ్మ, అడవిరావులచెరువు
నా భార్యను డెలివరీకి తీసుకొచ్చా..
నా భార్య డెలివరీ కోసం పెద్దాసుపత్రికి తీసుకొచ్చా. ట్రూలాన్ సూట్ప్యాక్ తీసుకురావాలని చెప్పారు. బయటకు వచ్చి మెడికల్ దుకాణంలో కొనుగోలు చేస్తే రూ.600 తీసుకున్నరు. విధిలేని పరిస్థితిలో మందులు తీసుకోవాల్సి వస్తుంది. ఇదేమని అడిగితే స్టాక్ లేదని చెబుతున్నారు. ఇదే ప్యాక్‌ను పెబ్బేరుకు చెందిన మహేశ్ తన భార్యను డెలివరీకి తీసుకొచ్చారు. ఆయనను కూడా అదే ప్యాక్ తీసుకరామని చెప్పారు.
– రాము, బలిగేర