మహబూబ్‌నగర్/ గద్వాల అర్బన్, జూన్ 17 : రాష్ట్ర వ్యా ప్తంగా వివిధ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా మ హబూబ్‌నగర్ జిల్లా పోలీస్ బాస్‌గా జానకి ధరావత్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి 28 మంది ఎస్పీలను బదిలీ చేయగా 2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జానకి ధరావత్ ఈస్ట్‌జోన్ హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తుండగా మహబూబ్‌నగర్ ఎస్పీగా బదిలీ చేశారు. ఈమె గతంలో మల్కాజ్గిరి డీసీపీగా పనిచేశారు. ఇక్కడ పనిచేస్తున్న హర్షవర్ధన్‌కు హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోగా పోస్టింగ్ ఇచ్చారు. జానకి ధరావత్ మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే జోగుళాంబ గద్వాల ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రితిరాజ్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు బ దిలీ చేశారు. ఆమె స్థా నంలో సైబరాబాద్ జో న్ బాలానగర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న టి.శ్రీనివాసరావును ఎస్పీగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు తెలిపాయి.