దోమలపెంట, ఫిబ్రవరి 25 : దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకున్న ఘటనా స్థలానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ బృందం రానుంది. గురువారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు బృందం దోమలపెంటకు చేరుకుంటున్నారు.
అంతకుముందు అచ్చంపేట నియోజకవర్గంలోని హాజీపూర్ వద్ద ఎస్ఎల్బీసీ టన్నె లును సందర్శించనున్నది. అనంతరం అక్కడ జ రుగుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత లోపల చిక్కుకున్న బాధిత కుటుంబాలతో మాట్లాడనున్నారు.