మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 28 : గుండె లయ తప్పితే జీవితమే చేజారిపోతుంది. శరీరానికి ఇంజన్ గుండె. హృదయ స్పందనలు పెరిగినా.. తగ్గినా.. ఏదో సమస్య ఉన్నట్లే. ఎప్పటికప్పడు మనగుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసుకోవాలి. అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆహారపు అలవాట్లు.. వ్యాయామం మన గుండె పనితీరుకు రక్షణ కవచం. మారుతున్న జీవన విధానంతో రక్తపోటు సమస్య ఎక్కువైంది. ఈ నేఫథ్యంలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ 1990 నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. గుండె జబ్బులపై అప్రమత్తత, అవగాహన పెంచడమే దీని లక్ష్యం. 2027 నాటికి గుండె జబ్బు మరణాలు 25 శాతం తగ్గించాలనే ఉద్దేశంతో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పనిచేస్తోంది. ఈ సందర్భంగా గుండె పదిలం కోసం నిపుణుల సూచనలు, సలహాలతో ప్రత్యేక కథనం.
ఒకప్పుడు 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు అలా కాదు. 30 ఏండ్ల వారికీ గుండెజబ్బులు రావడం పరిపాటిగా మారింది. ప్రపంచంలో 1.75 కోట్ల మంది హార్ట్ ఎటాక్‌లతో మరణిస్తే దేశంలో 95 లక్షలకుపైగా గుండె జబ్బు మరణాలు నమోదవుతున్నాయి. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మధుమేహం, ఊబకాయం వంటివి గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. అందుకే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి.
వాహనానికి ఇంజన్ ఎంత ముఖ్యమో.. మనిషి శరీరంలో గుండె అంతకన్నా ముఖ్యం. ఇంజన్ చెడిపోతే వాహనం ఎలా మొరాయిస్తుందో.. గుండె చెడిపోతే శరీరం అదుపు తప్పుతుంది. శరీరం కణ సమూహం, కణం జీవం కలిగి ఉండాలంటే ప్రతి అవయవానికి తగినంత ఆక్సిజన్.. పోషక పదార్థాలు (న్యూట్రిన్) సరఫరా నిరంతరం జరుగుతూ ఉండాలి.
రక్త నళాల ద్వారా రక్తంతో పాటుగా ఆక్సిజన్ గుండె పంప్ చేస్తుంటే శరీరంలోని అవయవాలన్నింటికీ సరఫరా అవుతుంది. వివిధ అవయవాల్లో చెడురక్తాన్ని సేకరించి గుండె శుద్ధి చేస్తుంది. గుండెకు మూడు నాళాలు ఉంటాయి. వీటి ద్వారానే మొత్తం ప్రక్రియ జరుగుతుంది. మనం నిద్రలో ఉన్న కూడా మన గుండె నిరంతరాయంగా పనిచేస్తది. లబ్‌డబ్ మన ఆరోగ్య రహస్యం. మన గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటున్నప్పుడే ఆరోగ్యకరంగా ఉన్నట్లు లెక్క.
జిల్లాలో ఏటేటా గుండె జబ్బు బాధితుల సంఖ్య పెరుగుతోంది. 2018లో గుండె జబ్బులతో ప్రభుత్వ జనరల్ దవాఖానకు ఆధిక సంఖ్యలో క్యూ కడుతున్నారు. అంటే గుండె జబ్బు రోగుల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో గమనించాలి. ఈ సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వారిలో 15 శాతం వరకు యువతే ఉన్నారు. మారిన జీవన విధానం, చదువు, ఉద్యోగాల్లో ఒత్తిడి గుండె జబ్బులకు ప్రధాన కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. గుండె నాళాల్లో చెడురక్తం పేరుకుపోవడంతో గుండె జబ్బులు వస్తున్నాయి.
దీనికి లైఫో ప్రోటీన్ ఏ ప్రధానం కారణం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది యువతలో అధికంగా కనిపిస్తుంది. మారుతున్న జీవన ప్రమాణాలతోనే గుండె లయ తప్పుతోంది. సంప్రదాయ ఆహారానికి దూరమైన మనిషి జంక్‌ఫుడ్‌కు దగ్గరవుతున్నాడు. దీనికి తోడు మద్యం, ధూమపానం అలవాట్లు రోజుకురోజుకూ పెరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట పట్టణాల్లో గుండె జబ్బుల బాధితులు రోజుకురోజుకూ పెరుగుతున్నారని ఇటీవల ప్రభుత్వం విడుదుల చేసిన హెల్త్‌బులెటిన్ హెచ్చరించింది.
ఇటీవల ఫంక్ష న్లు, డీజేల వద్ద డ్యాన్స్‌లు చే స్తున్న సమయ ంలో యువకు లు గుండెపోటుతో చనిపోతున్నారు. అ లాంటి వారు పూర్తిగా ఆరోగ్యంగా లేకపోవడం, సరైన సమయంలో ఆరోగ్య పరిస్థి తి చూసుకోరు. పొగతాగడం, మద్యం సే వించడం, మానసిక ఒత్తిడి పెరిగి జబ్బు పె రుగుతుంది. మా దగ్గరకు వస్తున్న వారిలో చాలా మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించాం. రోజుకూ 6 నుంచి 7 గంటల నిద్ర, వ్యాయామం, సరైన ఆ హారం, రోజుకు 3, 4 లీటర్ల నీళ్లు తాగ డం.. ప్రశాంతమైన జీవనం సాగించాలి.
– డాక్టర్ ప్రణయ్, గుండె వైద్య నిపుణుడు, మహబూబ్‌నగర్