మహబూబ్‌నగర్, జూన్ 13 : రక్తం పంచాలంటే రవ్వంత మంచి మనసుంటే చాలు తద్వారా ఎంతో మందికి ప్రాణం పోసినోళ్లమవుతాం. అందులోని తృప్తి అనుభవించి నోళ్లకు తప్పా ఇతరులకు అంతు పట్టదు. ఒక్కసారి మీరు రక్తమి చ్చి చూడండి. ఆ సంతృప్తి ఏమిటో మీకే తెలుస్తుంది. ఇలా పదుల సంఖ్యలో రక్తదానం చేసిన వారెందరో ఉన్నారు. 30 ఏండ్లుగా రక్తదానం చేసిన వారం దరో ఉండగా.. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కొందరిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. రక్తదానం చేస్తూ ప్రాణ పాయంలో ఉన్న వారిని రక్షి స్తూ ఎందరో ప్రాణ దాతలుగా నిలుస్తున్నారు.
జాతీయ రహదారి ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా మన పాలమూరు జిల్లా. అందుకే ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుం టాయి. క్షతగాత్రులకు సకాలంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. చాలామంది గర్భిణులు రక్తహీనతతో ప్రసవం సమయంలో మృత్యువాత పడుతున్న ఘట నలు ఉన్నాయి. వారి ప్రా ణాలు కాపాడుందుకు ఏ అర్ధరాత్రి పిలిచినా వెళ్లి రక్తదా నం ఇస్తున్నారు. ప్రముఖుల జ యంతి, వర్ధంతి ఉత్సవాలకు
రక్తదానం ఇస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
కీర్డ్లాండ్ స్టీనర్ అనే అమెరికన్ బయాలజిస్ట్‌గా, ఫిజీషి యన్‌గా ఎన్నో ప్రయోగాలు చేసి రక్తాన్ని కనిపెట్టాడు. ఆయ న పుట్టినరోజునే (జూన్14) ప్రపంచ రక్తదాతల దినోత్స వంగా మనం జరుపుకొంటున్నాం. రక్తం మనందరిని కలుపు తుంది అన్న నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 10.80 కోట్ల మంది రక్తదాతల నుంచి రక్తాన్ని సేక రిస్తున్నట్లు సమాచారం.
రక్తదానం చేయడానికి అర్హులు కాని వారు శ్వాసకోశ వ్యాధులున్నవారు.. క్యాన్సర్, గుండె జబ్బులు, ఉన్నట్లుండి బరువు తగ్గడం, డయాబెటిస్, హైపటైటిస్, ఆస్త మా, ఏపిలెప్సి, లెప్రసీ, కాలేయ వ్యాధులు, ఎండోక్రైన్ సమ స్యలు, ఎయిడ్స్ లక్షణాలు కలిగిన వారు రక్తదానం చేయ రాదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి అస్వస్థత ఉన్నవారు, ఏదైనా చికిత్సలో భాగంగా మందులు వాడుతున్నవారు. ఈ విషయాన్ని వైద్యులకు తెలియజేస్తే వారు ఎప్పటి దాకా రక్త దానం చేయొద్దో చెబుతారు.
నా బ్లడ్ గ్రూపు బీ-పాజిటివ్. నా చెల్లెల్లి పెండ్లి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మొదటిసారి రక్తదానం చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నాను. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 167వ సారి రక్తదానం చేస్తాను. రక్తదానం చేసినందుకుగానూ జాతీయ, రాష్ట్ర జిల్లా స్థాయిల్లో అవార్డులు అందుకున్నాను. ప్రస్తుతం మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు రెడ్‌క్రాస్ చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను.
– లయన్ నటరాజ్, మహబూబ్‌నగర్ జిల్లా, రెడ్‌క్రాస్ చైర్మన్
రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా యువత రక్తదానా నికి చేయడానికి ముందుకు వస్తున్నారు. గతంలో రక్తదా నం చేయడానికి భయపడేవారు కానీ ఇప్పుడు రక్తదానం చేయాలంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తం ఇస్తున్నా రు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదా తల ఎన్జీవోలు సహకరించిన కలెక్టర్ , దవాఖాన సూప రింటెంటెండ్, డీఎంహెచ్‌వో చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేసి ఇచ్చి సన్మానిస్తాం.
– మధుసూధన్‌రెడ్డి, బ్లడ్ సెంటర్ క్యాంప్ ఆర్గనైజర్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన