నాగర్ కర్నూల్: ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ ( ACB ) కి బాధితులు వరుస కడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోచోట ఉద్యోగులు, అధికారులు ఏసీబీకీ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడుతున్నారు.
తాజాగా నాగర్ కర్నూల్ ( Nagarkurnool ) జిల్లా తిమ్మాజిపేట ఎస్సై ( Timmajipet SI ) హరిప్రసాద్ రెడ్డి ( Hariprasad Reddy ) అధికారులకు చిక్కాడు. ఓ బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.