చందంపేట, మార్చి : చందంపేట మండలం నేరడుగొమ్ము గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అరెకంటి విజయ్ తండ్రి రాములు మృతి చెందారు. మృతదేహాన్ని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సోమవారం సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఆయన వెంట పీఏసీఎస్ మాజీ చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, అరెకంటి రాములు, పల్స వెంకటయ్య, సాయన్న, వెంకటయ్య ఉన్నారు.