పెబ్బేరు, సెప్టెంబర్ 21 : భారతీయ స్టేట్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం కేంద్రంలో దొంగలు చొరబడి రూ.17.92లక్షల నగదును ఎత్త్తుకెళ్లిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరులో చోటుచేసుకున్నది. రెండు రోజుల కిందటే చోరీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. పెబ్బేరు బస్టాండ్ ఎదురు గా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో 19వ తేదీన మ ధ్యాహ్నం బ్యాంక్ సిబ్బంది నగదు జమ చేసి వెళ్లా రు. 20వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను గ్యాస్ కట్టర్ సాయంతో మెషిన్‌ను కత్తిరించి అందులో ఉన్న రూ. 17లక్షల 92,500ల నగదును ఎత్తుకెళ్లారు. వారు వెళ్లిపోతూ ఏటీఎం షట్టర్‌ను సగం వరకు మూసి ఉంచడం తో.. అది రిపేరులో ఉందన్న భావనతో కస్టమర్లు ఎవరూ లోపలికి వెళ్లలేదు. దీంతో చోరీ జరిగిన విషయాన్ని బ్యాంక్ అధికారులు ఆలస్యంగా గమనించారు.
దుండగలు చోరీ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీ కెమెరాలకు నల్లటి స్ప్రే కొట్టి, వాటి పరికరాలన్నింటినీ తమతో తీసుకెళ్లారు. మెషిన్‌ను కట్ చేస్తున్న సమయంలో అందులోని కరెన్సీ కాలిపోకుండా నీటిని చల్లుతూ జాగ్రత్తలు తీ సుకున్నారు. ఒక వాహనంలో వచ్చి పకడ్బందీ ప్ర ణాళికతో ఏటీఎంను చోరీ చేసినట్లు డీఎస్పీ తెలిపా రు. ఘటనా స్థలాన్ని వనపర్తి ఏఎస్పీ రాందాస్ తే జావత్ సందర్శించారు. క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. ఏటీఎంల సూపర్వైజర్ నర్సింహాగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్న ఎస్సై హరిప్రసాదరెడ్డి తెలిపారు.