దేవరకద్ర మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఆదివారం రాత్రి తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డ సంఘటన చోటుచేసుకుంది. దేవరకద్ర ఎస్సై నాగన్న తెలిపిన వివరాల ప్రకారం బీసీ కాలనీ వాసి రాపతి రాఘవేందర్ .. కొన్ని రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్ళాడు. ఈ విషయం గ్రహించిన గుర్తు తెలియని దొంగలు ఇంట్లో తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న వస్తువులను చిందర వందరగా పడవేశారు. బీరువాలో ఉన్న మూడు మాసాల బంగారం, ఇతర వస్తువులు, ఆభరణాలను దోచుకెళ్లినట్లు తెలిపారు. సోమవారం ఉదయం పక్కింటి వారు ఈ సంగతి గ్రహించి హైదరాబాద్లో ఉన్న బాధితునికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై క్లూస్ బృందం ద్వారా ఇంటిని పరిశీలించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగన్న తెలిపారు.