పాలమూరు, డిసెంబర్ 9 : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంపై శుక్రవారం జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. దేశ్‌కీ నేత కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు పెద్దఎత్తున పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యమనేత కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి దేశంలో సంచలనం సృష్టించడం ఖాయమని ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అ ధ్యక్షుడు శివరాజ్, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ రాములు, నాయకులు శ్రీకాంత్‌గౌడ్, కౌన్సిలర్లు రవికిషన్, శ్రీనివాస్‌రెడ్డి, మునీరుద్దీన్, పటేల్ ప్రవీణ్, షబ్బీర్, ఉమర్, అంజద్, ఖాజాపాషా, మోసిన్, చిన్నా, లక్ష్మణ్‌నాయక్, కోఆCప్షన్ సభ్యుడు రామలింగం తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ, డిసెంబర్ 9 : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా మండలకేంద్రంలో పార్టీ నాయకు లు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా జై కేసీఆర్.. జైజై బీఆర్ఎస్ నినాదాలతో మార్మోగించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, వైస్‌చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ఉపసర్పంచ్ గంగాపురి, ముడా డైరెక్టర్ బాలయ్య, జంబులయ్య, రమణారెడ్డి, యాదయ్య, మాధవులు, మ న్నాన్, మహేందర్, మోహన్, శ్రీనివాసులు ఉన్నారు.
నవాబ్‌పేట, డిసెంబర్ 9 : మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ ప్రాంగణంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు మెండె శ్రీను, సుప్ప ప్రకాశ్, వెంకటేశ్, వీరేశ్, బంగారు పాల్గొన్నారు.