వనపర్తి టౌన్, మే 24 : ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి స్పష్ణమైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం చిట్యాల సమీపంలోని మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భం గా మాజీ మంత్రి మాట్లాడుతూ జవాబుదారీతనం లేకుం డా బాధ్యతారహితంగా సీఎం రైతులపై మాట్లాడడం బాధకరమన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి అమ్ముకోలేని దుస్థితి రైతులకు ఎందుకు దాపురించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ దుస్థితి నెలకొందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసి నాలుగు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసి ఆర్థిక భరోసా ఇచ్చినట్లు గుర్తుచేశారు. రైతులు పంట వేశాక 120 రోజుల పాటు వ్యవధి ఉంటుందని ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలు, చిత్తశుద్ధి లేక కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అర్హత లేని వారికి ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇచ్చి ధాన్యం తరలింపు ప్రక్రియలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
సివిల్ సప్లయి అధికారి స్టీఫెన్ రవీంద్ర నమ్మకమున్న అధికారి అని ట్రాన్స్పోర్ట్ టెండర్లో అవకతవకలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు లేఖ రాసి విచారణ చేపట్టాలన్నారు. నెలలు తరబడి రైతు పడిగాపులు కాస్తూ అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం అకాల వర్షాలతో నీటి పాలవుతుందన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలపై కేసులు పెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. పంట పండించేందుకు యూ రియా కోసం రైతులు రోజులు తరబడి క్యూలైన్లో వేచి చూశారని, కోటి50లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం, 45లక్షల మెట్రిక్ టన్నుల మక్క ధాన్యం మార్కెట్‌కు వచ్చిందని, నెల 15రోజుల్లో 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారని, ఇంకో 10,15 రోజుల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని ఎలా కొంటారని మాజీ మంత్రి ప్రశ్నించారు.
జిల్లాలో 57మిల్లులో పంచనామా చేసి కేవ లం 34మిల్లుల్లో యాజమాన్యాలపై చర్యలు తీసుకున్నారని, అధికార పార్టీకి చెందిన యాజమాన్య మిల్లులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, పక్షపాత ధోరణితో తమ కు అనుకూలంగా ఉన్న మిల్లర్లపై కేసులు ఉన్నా ధాన్యం కేటాయించారన్నారు. జిల్లా యంత్రాంగం మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన సిఫారసులను అమలు చేస్తూ నిబంధనలను గాలికి వదిలేసి రైతుల నోట్లో మట్టి కోడుతున్నారన్నారు.
ఎఫ్‌సీఐ నిబంధనలు మిల్లర్లకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి, ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు తరుగు తీస్త్తూ మోసం చేస్తున్నారన్నారు. మిల్లర్లతో ఎమ్మెల్యేలు, మం త్రులు ఇండ్ల్లల్లో మీటింగ్‌లు ఎలా పెడతారని, అధికారులు ఎందుకు నిస్పక్షపాతంగా ఉండడం లేదని ప్రశ్నించారు. జిల్లావ్యాప్తంగా ప్రధానంగా మూడు మిల్లులకే ఎక్కువ ధాన్యం పోతుందని, కేసులు ఉన్నా మిల్లులకు దొంగ డాక్యుమెంట్లతో నిల్వలేలా ఇస్తారని, కేసులు ఉన్న మిల్లులందరికీ కూడా ధాన్యం నిల్వలు అనుమతులు ఇచ్చి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి..
చిన్నంబావి మండలంలో శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి మూ డేళ్ల కాలమవుతున్నా హత్య చేసిన హంతకులను ఎందు కు పట్టుకోలేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. డీజీపీ, పోలీస్ యంత్రాంగం సిగ్గుపడాలని విమర్శించారు. హ త్య జరిగాక ముగ్గురు డీజీపీలు , ఇద్దరు ఎస్పీలు మారారని ప్రస్తుత రాష్ట్ర క్యాబినేట్ మంత్రి సహచర పాత్ర ఉం దని, ఎందుకు హంతకులను పట్టుకోవడం లేదనిది వారే చెప్పాలన్నారు. అతడు నీ సామాజిక వర్గమే కాదా.. శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో ఎందుకు మౌనంగా ఉండి అరెస్ట్ ఎందుకు చేయలేదన్నారు. సీఎం, పోలీస్ ఏంచేస్తే దిగివస్తారని, నేరుగా కుటుంబ సభ్యులు సీఎం ఇంటి ముందే ధర్నాకు కూర్చుంటారని ఆయన హెచ్చరించారు. అనంతరం వనపర్తి మార్కెట్‌యార్డును పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వాకిటి శ్రీధర్, లక్ష్మారెడ్డి, నందిమల్ల అశోక్, జోహెబ్హుస్సేన్, రమేశ్‌గౌడ్, రాము, ప్రేమ్‌నాథ్‌రెడ్డి ఉన్నారు.