మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబర్ 16 : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. సింహభాగం ఒప్పంద, అతిథి గురువులతోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానాచార్యుల నుంచి అధికారి స్థాయి వరకు చాలాచోట్ల ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉండడంతో గెస్ట్ లెక్చరర్లు వారులేని లోటును భర్తీ చే స్తున్నారు. కొన్ని కళాశాలలకు పోస్టులు మంజూరు లేకపోవడం, ఇంకొన్నిచోట్ల బోధకుల కొరతతో తెలుగు, ఆంగ్ల మాధ్యమం కలిపి బోధిస్తున్న పరిస్థితి. రెగ్యూలర్ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని గెస్ట్ లెక్చరర్లు కోరుతున్నారు. పీహెచ్‌డీలు, పీజీలు చేసి రెగ్యులర్ ఉద్యోగం దొరక్క.. చాలీచాలనీ వేతనాలతో కుటుంబాలను పో షించుకుంటున్నామని మనోవేదనకు గురుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటి పరిధిలో మహబూబ్‌నగర్ జిల్లాలో 71మంది, నాగర్‌కర్నూల్-73, వనపర్తి-56, నారాయణపేట-44, జోగుళాంబ-గద్వాల జిల్లాలో 41మంది గతేడాది పనిచేశారు. వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులు ప్రభుత్వాన్ని కోరడంతో ఈనెల 3వ తేదీన (విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడు నెలలు పూర్తయిన తర్వాత) విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రొసీడింగ్ జారీ చేసినా.. అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కరవైంది. పనిగంటల విధానంలోనే వేతనాలు చెల్లిస్తుండడం, అవికూడా సకాలంలో అందించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొత్తగా జేఎల్ రిక్రూట్మెంట్ కానుండడంతో నిత్యం భయం భయంగా బతుకులీడుస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఈ ఏడాది కొత్తగా సీసీకుంట, మ హ్మదాబాద్లోనూ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చే శారు. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 278 జూనియర్ లెక్షరర్ పో స్టులు ఉండగా.. 164 భర్తీ చేయగా.. 113 ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన మహ్మదాబాద్‌లో 75 మంది, సీసీకుంటలో 55 విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్త కళాశాలల్లో 12 మంది చొప్పున అధ్యాపకుల అవసరం ఉంది. కానీ ఒక్కరు కూడా అందుబాటులో లేరంటే అతీశయోక్తికాదు.
రాష్ట్రవ్యాప్తంగా 1,654 మంది ఉన్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు రూ.42వేలు వేతనం ఇవ్వాలి. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ మంత్రులు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి న్యాయం చేయాలి. మరోవైపు వేతనాలు రాక కుటుంబాల పోషణ భారంగా మారింది. జూన్, జూలైలో పనిచేసిన కాలానికి వేతనాలు ఇవ్వాలి.
కళాశాలలు తెరచి మూడు నెలలైంది. గెస్ట్ లెక్చరర్స్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు ప డుతుందో. మా కాలేజీలో తె లుగు, ఇంగ్లిష్ బోధించడంలే దు. మరికొంత సమయం గడి స్తే పరీక్షలు కూడా వస్తాయి. ఏం చదవాలి.. ఎలా రాయా లి. ప్రభుత్వం స్పందించి అ ధ్యాపకులను నియమించాలి.
మా కాలేజీలో తెలుగు, ఇంగ్లిష్‌కు అధ్యాపకులు లేరు. ఇప్పటి వరకు ఈ సబ్జెక్టుల వైపు చూడడం లేదు. అధ్యాపకులు వచ్చేదెప్పుడో.. మాకు చెప్పేదెప్పోడో అర్థం కావడం లేదు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ కళాశాలలపై శ్రద్ధ లేనందునే ఇలా వదిలేశారు. లేట్‌గా వచ్చి చెప్పినా.. ముందు నుంచి చెప్పినట్లుగా ఉండదు. ఈ ప్రభావం ఫలితాలపై పడుతోంది.
మాకు ఇంత వరకు ఇంగ్లిష్ లో బోధించడంలేదు. లెక్చరర్ లేడని చెబుతున్నారు. ఇప్పటికే చాలా రోజులైంది. ఇంకా రా వడం లేదు. ఇంగ్లిష్ సబ్జెక్టును మొదలు పెట్టకపోతే, పరీక్షలు ఎలా రాస్తాం. హడావుడిగా వచ్చి చెప్పినా మాకు అర్థకావడం కష్టం. ముందు నుంచి తరగతులు జరిగితే, ఆ ప్రభావం వేరేలా ఉంటుంది. త్వరగా ఇంగ్లిష్ బోధన మొదలు పెట్టాలి.
గెస్ట్ లెక్చరర్స్‌ను తీసుకునేందుకు త్వరలోనే అనుమతులు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవా ల్సి ఉండింది. కొన్నిచోట్ల గ తంలో పని చేసినవారు బోధిస్తుండడంతో ఇబ్బంది లేదు. మరి కొన్నిచోట్ల మాత్రమే స మస్య ఉంది. త్వరలోనే పరిష్కారమతుందని ఆశిస్తున్నాం. విద్యార్థులకు నష్టం జరగనివ్వం. అనుమతులు రాగానే నిబంధనల మేర భర్తీ చేస్తాం.
ఏటా సకాలంలో గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయాలి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక అ ధ్యాపకుడు ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. మనోవేదనతో కు టుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రభుత్వం విద్యాసంస్థను బలోపేతం చేస్తుందని చెబుతున్నా.. కొందరు కార్పోరేట్‌కు సహకారం అందిస్తున్నారు. ఎంఏ బీఈడీ, ఎంఫిల్, పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్‌ను. 12ఏండ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నా. ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని, కుటుంబాల్ని ఆదుకోవాలి.
ఎన్నికల సమయంలో క్రమబద్దీకరిస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. జేఎల్ రిక్రూట్మెంట్ కొనసాగుతున్నది. నిరుద్యోగులను ఉద్యోగులుగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నిరుద్యోగులను చేయొద్దు. ఉద్యోగభద్రత కల్పించాలి.