ఆగస్టు 16 : రేషన్ దుకాణ డీలర్లతో ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాలు నడుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. డీలర్లతో నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై గతంలో వరుస కథనాలు వెలువడడంతో అధికారులు వారి రూటును మార్చారు. కొత్త తరహా వసూళ్లకు తెరలేపారు. నెలనెలా తీసుకునే మామూళ్లు వదిలేసి.. వీళ్లు రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎంతలా అంటే.. అధికారులు ఫోన్ చేస్తే చాలు.. బియ్యం గోదాంల వద్ద ఏ ఊరికి వెళ్లే లారీ లోడ్లో ప్రతి షాప్పై 3 నుంచి 5 వరకు 50 కేజీల బియ్యం ప్యాకెట్లు తీస్తున్నట్లు సమాచారం. ఒక్కో సారి 10 నుంచి 15 ప్యాకెట్ల వరకు తేడాలు కూడా వస్తున్నట్లు సమాచారం. దాదాపు ఒక్కో దుకాణం నుం చి 2 క్వింటాళ్ల నుంచి 5 క్వింటాళ్ల బియ్యం తీసి వాటిని గుట్టుగా రైస్ మిల్లులకు పంపుతున్నట్లు తెలిసింది. క్వింటాకు
విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్క దుకాణం మీద రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా నిలువు దోపిడీ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అలా ఒక్క మండలం నుంచి దాదాపు రూ.లక్ష నుంచి రూ.2 ల క్షల దాకా ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు వ సూళ్లకు పాల్పడుతున్నట్లు పెద్ద మొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క మండలం నుంచి రూ. లక్ష, రూ.2 లక్షలు అంటే దాదాపు జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ. 10 లక్షల
నుంచి రూ.15 లక్షల వరకు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. గద్వాలతోపాటు అయిజలో ఈ వ్యవహారం గుట్టు గా సాగుతున్నట్లు రేషన్ డీలర్లలో చర్చ జోరందు కున్నది. అయితే ప్రభుత్వం ఈ మూడు నెలలకు సంబంధించిన బి య్యం కోటాను ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేపట్టింది. ఈ క్రమంలో గద్వాల మండలంలో ఓ రేషన్ దుకాణానికి దాదాపు 30 బ్యాగులు.. 29 కేజీలు ఉండడం గమనార్హం. అలాగే గట్టు మండలంలోని ఓ గ్రామంలోని దుకాణానికి 19, మరో గ్రామానికి 26, అయి జ మండలంలోని ఓ గ్రా మంలో 36 ప్యాకెట్లలో 50 కేజీలకుగానూ 33,41,43,27 తదితర కేజీల బియ్యం
వస్తున్నట్లు సమాచారం. రేషన్ డీలర్లు తరుగు వచ్చిందని అధికారులను అడిగితే.. పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది. చేసేదేమీ లేక రేషన్ డీలర్లు.. వచ్చిన కాడికి బియ్యం సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు.
ప్రతి గ్రామంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి. వారికి ఎన్ని క్విం టాళ్ల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటే.. అంతే అందజేస్తాం. అలాగే రేషన్ డీలర్, లబ్ధిదారుడికి బియ్యం గింజ చేరేలా చర్యలు తీసుకోవాలి. అధికారులు మామూళ్లు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలి. బియ్యం కోటా తక్కువగా వస్తే తెలియజేయండి.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
– లక్ష్మీనారాయణ, ఏసీ, గద్వాల జిల్లా