మూసాపేట, మే 21 : వీధి కుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు చంపి పడేసిన ఘటన మండలంలో ని జానంపేట గ్రామంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జానంపేట శివారులో హైవే-44 పక్కనున్న కాల్వలో సోమవారం రాత్రి 15 కుక్కలను చంపి పడేశారు. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం అం దించారు. ఎస్సై సుజాత ఘటనాస్థలికి చేరుకొని ప రిశీలించారు. జానంపేట పంచాయతీ కార్యదర్శి మాధవి ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించా రు. కుక్కలను చక్రాపూర్ వైపు ఉన్న వ్యవసాయ పొ లాల్లోకి తీసుకెళ్లి అడ్డాకుల వెటర్నరీ డాక్టర్ రాజేశ్‌ఖన్నా సిబ్బందితో కలిసి శవ పరీక్షలు నిర్వహించా రు. విషప్రయోగం చేసి కుక్కలను చంపారేమో అని అనుమానంగా ఉందని ఎస్సై తెలిపారు. కుక్కలన్నింటినీ వాహనంలోనే తీసుకొచ్చి ఉంటారని, ఈ విషయంపై విచారణ చేపడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా కుక్కలను చంపిన వారిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఫిబ్రవరి 16వ తేదీన ఇదే మండలంలోని పొన్నకల్ గ్రామానికి చుట్టపుచూపుగా వచ్చిన వ్యక్తి రాత్రి సమయంలో 25 కుక్కలను తుపాకీతో కాల్చి చంపారు. భూత్పూర్ సీఐ రామకృష్ణ ఛాలెంజింగ్‌గా తీసుకొని ఆ కేసును ఛేదించి నిందితులను కటకటాల్లోకి పంపించారు. మళ్లీ అదే రీతిలో ఒకేసారి 15 కుక్కలను చంపి జాతీయ రహదారి పక్కన పడేసిన ఘటన కలకలం రేపుతున్నది.