నారాయణపేట, జనవరి 22 : బీఆర్ఎస్ హ యాంలో అప్పటి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఎస్. రా జేందర్‌రెడ్డి నేతృత్వంలో నారాయణపేట జిల్లా ప్రగ తి పథంలో పరుగులు పెట్టింది. నారాయణపేట జిల్లా కేంద్రం ఏర్పాటుతో అనేక ప్రభుత్వ కార్యాలయాలు పేటకు తరలివచ్చాయి. అందులో భాగంగా నే ప్రభుత్వం ఆయా కార్యాలయాల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. అందులో జిల్లా దవాఖాన నిర్మాణానికి రూ.56 కోట్లు, నూతన కలెక్టరేట్ నిర్మాణానికి రూ.55 కోట్లు, కలెక్టర్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.8.65 కోట్లు, ఎస్పీ కార్యాలయ నిర్మాణానికి రూ.38.60 కోట్లు, నారాయణపేట రూరర్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రూ.3కోట్లు,
నారాయణపేట మినీ స్టేడియానికి రూ.10.65 కో ట్లు, మరికల్ మండల కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 7కోట్లు, ధన్వాడ తాసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి రూ.కోటి 75 లక్షలు, ధన్వాడ పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.3కోట్లు, నారాయణపేటలో వైకుంఠ ధామా ల నిర్మాణానికి రూ.కోటి యాభై లక్షలు, నారాయణపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ నిర్మాణానికి రూ.2కోట్లు, వృద్ధాశ్రమ నిర్మాణానికి రూ.కోటి పది లక్షలు, సీడీపీ నిధులతో వివిధ అభివృద్ధి పనులకు రూ.6 కోట్లు, కోయిల్‌సాగర్ లెఫ్ట్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.30కోట్లు, గోదాంలలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. కోటి, చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.68 కోట్ల రెండు లక్షలు, ఎస్డీఎఫ్ నిధులు, ఎమ్మెల్యే ద్వారా వివిధ పనులకు రూ.15 కోట్లు, గోల్డ్ షాప్ మారెట్ నిర్మాణానికి రూ.20 కోట్లు, జిల్లా లైబ్రరీ భవన నిర్మాణానికి రూ.2కోట్లు, మాడ్రన్ మేకనైజేల్డ్ లాటరీ ఏర్పాటుకు రూ.కోటి, చిల్డ్రన్స్ హోమ్ బిల్డింగ్‌కు రూ.27 లక్షలు,
నారాయణపేటలో ఎస్సీ క మ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.80 లక్షలు, ధన్వాడలో బస్టాండ్ నిర్మాణానికి రూ.50 లక్షలు, నారాయణపేటలో మినీ బస్ స్టాప్ నిర్మాణానికి రూ.45 లక్షలు, కోయిలకొండ బస్టాండ్ నిర్మాణానికి రూ.50 లక్షలు, మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి రూ. 180 కోట్లు, మరికల్ బస్టాండ్‌లో అభివృద్ధి పనులకు రూ.కోటి 75లక్షలు, జిల్లా దవాఖాన సమీపంలో షా పింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు రూ.కోటి ముప్ఫై ఐదు లక్షలు, నారాయణపేటలో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, నారాయణపేటలో బంజారా భవ నిర్మాణానికి రూ.కోటి చొ ప్పున మొత్తం రూ.554కోట్ల 39 లక్షలు మంజూరు చేయించగా వీటిలో కొన్ని పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులకు మంజూరైన నిధులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనకి వెళ్లాయి.

పేట ప్రధాన రోడ్డు విస్తరణ భేష్..
గతంలో ఒక వాహనం వెళ్లాలంటే మరో వాహ నం రస్తా వద్ద ఆగిపోవాల్సిందే. ఎవరైనా రోడ్డు పక న బైక్ ఆపినా ట్రాఫిక్ జామ్ అయ్యేది. పట్టణ ప్రజలే కాకుండా వివిధ పనుల నిమిత్తం నారాయణపేటకు వచ్చే జనం ఇబ్బందిపడేవారు. కేవలం కాగితాలకే పరిమితమైన నారాయణపేట రోడ్డు వెడల్పునకు ఎస్. రాజేందర్‌రెడ్డి శ్రీకారం చుట్టి పూర్తి చేయించా రు. రాష్ట్రంలో మరేకడా లేని విధంగా రూ. 28.50 కోట్ల వ్యయంతో రోడ్డు వెడల్పుతోపాటు, ఇండ్లు, దుకాణాలు, కోల్పోయినవారికి నష్టపరిహారం అందించి రోడ్డు వెడల్పు చేయించారు. అదే విధంగా రూ. 18.50 కోట్లతో భీమండికాలనీ నుంచి ఎర్రగుట్ట వరకు రోడ్డు వెడల్పు చేయించారు. మధ్య లో గార్డెనింగ్, బట్టర్ఫె్లై లెట్లతో అందాలు విరజిమ్మే లా తయారయ్యాయి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోడ్డు మార్గాన ఉన్న వీధి లైట్లకు కాలిపోయిన బల్బులు వేయించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. కోయిలకొండ, దామరగిద్ద మండల కేంద్రాల్లోనూ రోడ్డు వెడల్పు చేయించారు. అలాగే నారాయణపేట మండలం అప్పక్‌పల్లి నుంచి కోటకొండ మీదుగా కోయిలకొండ వరకు రూ.60కోట్లతో డబు ల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయించకుండా వస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెరువులకు పూర్వ వైభవం..
70 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా పూడికతీతకు నోచుకోకపొవడంతో చెరువుల్లో నీటి నిల్వ శాతం తగ్గి భూగర్భజలాలు తగ్గుముఖం పడు తూ వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మిషన్ కాకతీయ’ పథకంతో చెరువుల్లో పూడిక తీయడం, దెబ్బతిన్న తూములను బాగు చేసుకోవడం జరిగింది. శిథిలావస్థకు చేరిన ట్యాంక్ బండ్లను పునరుద్ధరించి, రివిట్ మెంట్లను అభివృద్ధి చేశారు. 1, 2, 3, 4 విడుతల్లో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలోని పనుల ద్వారా నారాయణపేట నియోజవర్గం లో రూ.52కోట్ల వ్యయంతో 315 చెరువుల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టారు. తద్వారా చెరువుల్లో నీటినిల్వ శాతం పెరిగింది. ఫలితంగా భూగర్భ జలాల శాతం పెరిగి బోర్లు చక గా పనిచేస్తున్నాయి. వీటి కింద 13,705ఎకరాలు సాగు అవుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల రోడ్లు అభివృద్ధి..
తెలంగాణ రాక ముందు నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్లాలన్న గుంతలమయమైన రోడ్ల కారణంగా నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఉండేది. నారాయణపేట నుంచి దామరగిద్ద వరకు రోడ్డు దుస్థి తి అధ్వానంగా ఉండేది. అంతేగాక దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75ఏండ్లు అవుతున్నా సజనాపూర్, మ డుగులమూల తండా వంటి ఎన్నో గ్రామాలకు అస లు రోడ్లు ఉండేవి కావు. కానీ తెలంగాణ ఏర్పడి తర్వాత అప్పటి ఎమ్మెల్యే ఎస్ఆర్ఎడ్డి ఆధ్వర్యంలో రూ.100.93 కోట్లతో నియోజకవర్గంలోని ప్రతి ఊ రికి తారురోడ్లు వేయించి గ్రామీణ రోడ్డు వ్యవస్థను మెరుగుపరిచారు. ఫలితంగా గ్రామీణ ప్రాంత వాసు లు సునాయాసంగా మండల కేంద్రాలకు వచ్చి వెళ్తున్నారు. కానీ నేడు ఆ రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఆహ్లాదకరంగా పారులు..
రోజువారి పనుల్లో బిజీ బిజీగా గడిపే పట్టణవాసులువాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్‌లు, చి న్న పిల్లలకు ఆడుకోవడానికి పారులు, వృద్ధులు కా లక్షేపం చేయడానికి రూ.50లక్షలతో సినీయర్ సిటిజన్ పారు, యువకులు జిమ్ చేసుకోవడానికి రూ. 50లక్షలతో జిమ్ పరికరాలు, రూ.కోటి 30లక్షలతో చిల్డ్రన్స్ పారు, విద్యార్థులు సరదాగా గడపటంతోపాటు మేథస్సు పెంచుకోవడానికి రూ.కోటి 45లక్షలతో సైన్స్ పార్, రెండు ఓపెన్ జిమ్ పారులు, బీసీ కాలనీలో రూ.2కోట్లతో అతి పెద్ద పారును ఏర్పాటు చేశారు.
పల్లె పల్లెకు ప్రకృతి వనాలు..
పల్లె పచ్చగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయించారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతవాసులు ఆరోగ్యం గా ఉండాలని పల్లెప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాక్‌లు నిర్మించారు. నారాయణపేట నియోజవర్గంలో ఒకొక గ్రామంలో రూ.3.50లక్షల చొప్పన రూ.4,86,50,000 వ్యయంతో 139 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయించారు. కానీ నేడు వాటికి నీరు పోసే పరిస్థితి లేకపోవడంతో చాలా వరకు ప్రకృతి వనాలు కళాహీనంగా దర్శనమిస్తున్నాయి.
కొత్తగా 16 విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితులు పైగా కరెంట్ కోతలతో రైతులు పండించిన పంటలు రైతుల ముందు ఎండిపోతుంటే చూస్తూ ఏమి చేయలేని నిస్సాహాయ స్థితిలో వ్యవసాయ విద్యుత్ రంగం ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఒక నారాయణపేట నియోజకవర్గంలో 33/11 కేవీ 13సబ్స్టేషన్లు ఉండ గా కొత్తగా 16 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయించారు. ఇందులో 2 కొత్తగా 132/33 కేవీ సబ్స్టేషన్లు ఏర్పా టు చేయించారు. దీంతో నేడు నాణ్యమైన 24గంట ల ఉచిత విద్యుత్ అందుతున్నది. గతంలో ఒక ట్రా న్స్ఫార్మర్ పై ఎనిమిది, తొమ్మిది వ్యవసాయ విద్యు త్ కనెక్షన్లు ఉండేవి. దీంతో అధిక లోడ్ కారణంగా తరుచూ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయేవి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఒక ట్రాన్స్ఫార్మర్పై నాలుగు నుంచి ఐదు వ్యవసాయ కనెక్షన్లు మాత్రమే ఉంటున్నాయి.
ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు..
కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో గుకెడు నీళ్ల కోసం ఆడబిడ్డలు మైళ్ల దూరం నడిచే పరిస్థితి ఉండేది. మంచినీటి ట్యాంకుల వద్ద నీళ్ల కోసం మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటే తప్పా బిందెడు నీళ్లు దొరికేవి కావు. నీళ్లు వచ్చినా నాలుగురోజులకు ఒకసారి అందేవి. ఏ ఒక తెలంగాణ ఆడబిడ్డ నీటి కోసం కష్టాలు పడరాదని భావించిన అప్పటి సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఆ గంగమ్మను ఇంటింటికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అంతే కాకుండా నారాయణపేట నియోజకవర్గంలో రూ.138 కోట్ల 29 లక్షల వ్యయంతో మంచినీటి పైపు లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి 99శాతం ఇండ్లకు మంచినీటి కనెక్షన్లు ఉచితంగా అందజేశారు. అంతేకాకుండా శుద్ధి చేసిన కృష్ణానది నీటిని ప్రతి రోజూ అందిస్తూ వస్తున్నారు.
సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాల ప్రభుత్వపరం..
నియోజకవర్గం కేంద్రంలో ఒక ప్రభుత్వ డిగ్రీ క ళాశాల లేక బడుగు బలహీన వర్గాల విద్యార్థులు డిగ్రీ విద్య చదువుకొనే ఆర్థిక స్థోమత లేక చదువులను మధ్యలోనే ఆపి వేసేవారు. రాజేందర్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాంత చిరకాల కోరిక అయినటువంటి సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాలను, చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభు త్వ డిగ్రీ కళాశాలగా నామకరణం చేస్తూ ప్రభుత్వ పరం చేయించి ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయించారు. విద్యార్థులు చదువుకోవడానికి అదనపు గదుల నిర్మాణం కోసం ఎస్డీఎఫ్ నిధుల కింద రూ.2 కోట్ల 9లక్షల రూపాయలు కేటాయించా రు. కళాశాలకు న్యాక్, అక్రిడేషన్‌లో బీ ప్లస్ గుర్తింపు రా వడానికి తనవంతు సాయాన్ని అందజేశారు. అదే విధంగా దామరగిద్ద జూనియర్ కళాశాలకు రూ. 2. 25కోట్ల్లు, కో యిల్కొండ జూనియ ర్ కళాశాలకు రూ. 2.25 కోట్లు, ధన్వాడ జూనియర్ కళాశాలకు రూ.2.25కోట్లు,, నారాయణపేట జూనియర్ కళాశాలకు రూ.2.25 కోట్లు, కోయిలకొండ కేజీబీవీకి రూ.2.25కోట్లు మంజూరు చేయించారు.
61 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం..
2014 ముందు వరకు అనేక గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉండేవి కావు. రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత నారాయణపేట నియోజకవర్గ వ్యాప్తంగా రూ.12కోట్ల 13లక్షలతో 61 గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో సొంత భవనాల్లో పరిపాలన అందించే సదుపాయం కల్పించారు.
సంక్షేమ పథకాల అమలులోనూ..
దళితులకు ఆర్థిక భద్రత, మంచి భవిష్యత్‌ను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం దేశం లో ఎకడాలేని విధంగా ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకంతో వందలాది మంది దళితులు లక్షాధికారులుగా మారారు. నారాయణపేట నియోజవర్గంలో 1200కుటుంబాలకు ఒకో కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున 1200కుటుంబాలకు రూ. 120కోట్లు వన్ టైం గ్రాంట్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ హ యాంలో ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్క నారాయణపేట నియోజవర్గంలో 97,278 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి 58వేల మందికి ఉచితంగా అద్దాలను పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నివసించే యువతులకు వివాహ సమయంలో రూ.1,00,116 ఆర్థికసాయాన్ని అం దజేసేందేకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశ పెట్టింది. 2023 డిసెంబర్ ముందు వరకు నారాయణపేట నియోజవర్గంలో 10,885 మందికి కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ చెకులను అందజేసింది. తాము అధికారంలోకి వస్తే అప్పటివరకు అం దిస్తున్న లక్ష రూపాయలకు తోడు తులం బంగారు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్, రెండేళ్లు అవుతున్న నేటికీ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే లక్ష రూపాయాలను అందిస్తూ తులం బంగారు హామీని ఎగ్గొడుతూ వస్తుంది.