ఉమ్మడి జిల్లాలో పచ్చని పండుగ అంబరాన్నంటింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన హరితోత్సవం ఊరూరా ఉత్సాహంగా సాగింది. మహిళలు బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులు వేసిన రంగవల్లులు అలరించాయి. పలు ప్రాంతాల్లో సామూహికంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్యేలు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కదలివచ్చి భాగస్వాములయ్యారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామం ఆవరణలో, జడ్చర్ల సమీపంలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో జరిగిన వేడుకకు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరవ్వగా.. పెద్దమందడి పోలీస్‌స్టేషన్ ఆవరణలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, జూన్ 19
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన హరితోత్సవం ఊరూరా ఉత్సాహంగా సాగింది. మహిళలు బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించగా.. పాఠశాలల్లో విద్యార్థులు వేసిన రంగవల్లులు అలరించాయి. పలు ప్రాంతాల్లో సామూహికంగా మొక్కలు నాటగా.. ఎమ్మెల్యేలు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని మొక్కలు నాటారు.
– నెట్వర్క్, జూన్ 19