వనపర్తి టౌన్/అలంపూర్/నారాయణపేట/కొల్లాపూర్/ ధన్వాడ/భూత్పూర్, నవంబర్ 5 : కాంగ్రెస్ అరాచక పాలనతో రాష్ట్రం అధోగతి ప ట్టించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్‌లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భం గా మాజీ మంత్రి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఘాటుగా విమర్శించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానకరంగా మాట్లాడిన మంత్రులు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలకు ప్రజా పాలన అందించారన్నారు.
రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అధోగతి పట్టించారన్నారు. జూ బ్లీహిల్స్తోపాటు హైదరాబాద్ నగరా న్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ బలపరిచిన మా గంటి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రచారం నిర్వహించారు. అలాగే రహ్మత్‌నగర్‌లో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, బోరబండబస్తీలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఇంటిం టి ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో వనపర్తి, కొల్లాపూర్, నారాయణపేట నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahabubnagar4