కొల్లాపూర్ : మండలంలోని సింగపట్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వందల సంవత్సరాల చరిత్ర కలిగి లింగాకారంలో స్వయంభుగా వెలిసిన దేవస్థానానికి నిధులు కేటాయించాలని సింగోటం గ్రామ ఉపసర్పంచ్ తమటం సాయి కృష్ణ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆలయ ఆవరణంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున సింగోటం(Singotam Temple) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. దేవస్థానానికి ఎదుట లక్ష్మీదేవి అమ్మవారి గుట్ట పై వెలసిన లక్ష్మీదేవమ్మ అమ్మవారు క్షేత్రాన్ని పర్యటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల జాతర సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలయ అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.