ఆన్లైన్ ఇసుకతో అవస్థలు
ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ నిలిచిపోవడంతో దళారులదే రాజ్యమైంది. రాత్రి పగలు తేడా లేకుండా దర్జాగా తరలిస్తూ అడ్డగోలు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గడచిన ఐదు నెలలుగా ఇదే పరిస్థితి.
- వనపర్తి జిల్లాలో 11 రీచ్‌లు
- ఐదింట్లో నిలిచిన బుకింగ్‌లు
- ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట
- అడ్డదారుల్లో దళారులకు ఈజీగా..
- అధిక ధరలతో జనం బెంబేలు
వనపర్తి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ నిలిచిపోవడంతో దళారులదే రాజ్యమైంది. రాత్రి పగలు తేడా లేకుండా దర్జాగా తరలిస్తూ అడ్డగోలు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గడచిన ఐదు నెలలుగా ఇదే పరిస్థితి. దీంతో వినియోగదారులంతా ఇటు అధిక ధరలు చెల్లించలేక.. అటు ఆన్లైన్ బుకింగ్ చేసుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో నిర్వహించిన జెడ్పీ సమావేశంలోనూ ఇసుక ఆన్లైన్ బుకింగ్ కావడం లేదన్న చర్చ జరిగిన సంగతి తెలిసిందే. జిల్లాలో గుర్తించిన క్వారీల్లో నుంచి ఇసుకను తరలించేందుకు ఆన్లైన్ బుకింగ్ నిలిచిపోవడంతో రవాణా ఆగిపోయిం ది. దీంతో నిర్మాణాలు చేపట్టిన వారికి కొరత ఏర్పడింది.
11 రీచ్‌లుంటే..
వనపర్తి జిల్లాలో 11 వరకు ఇసుక రీచ్‌లు ఉన్నాయ ని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వీటిలో పె బ్బేరు మండలం శాగాపురం, రామంతాపూర్, కొత్తకోట మండలం పామాపురం, అప్పరాల, ఆత్మకూరు మండ లం తిప్పడంపల్లి, రేచింతల, పెద్దమందడి మండలం చి లకటోనిపల్లి, ఖిల్లాఘణపురం మండలం కమాలుద్దీన్‌పూర్, మదనాపురం మండలం కర్వెన, దుప్పల్లి, వీపనగండ్ల మండలం తూంకుంటలో ఇసుక రీచ్‌లు ఉ న్నాయి. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి వీటి ద్వారానే ప్రభుత్వ లెక్క ప్రకారం ఇంటికే ఇసుక వ స్తుంది. ఒక్కో రీచ్ నుంచి ఆయా దూరం మేరకు ధర లు నిర్ణయించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆయా రీచ్‌లకు సంబంధించి ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఇసుకను బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఐదు క్వారీల్లో బుకింగ్ బంద్
జిల్లాలోని ఐదు ఇసుక క్వారీల్లో ఆన్లైన్ బుకింగ్ నిలిచిపోయింది. వీటిలో వీపనగండ్ల మండలం తూం కుంట, మదనాపురం మండలం దుప్పల్లి, కర్వెన, ఖిల్లాఘణపురం మండలం కమాలుద్దీన్‌పూర్, పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి శివారులోని ఇసుక క్వారీల్లో ఆన్లైన్ బుకింగ్‌లు ఐదు నెలలుగా నిలిచిపోయాయి. ఈ సెంటర్లలోనూ ఎప్పుడో ఒకసారి అధికారులకు ఇ ష్టం ఉన్నప్పుడు కొంత సమయం ఆన్లైన్ బుకింగ్ అవకాశం ఇచ్చి నిలిపి వేశారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఆరా తీసినా సరైన సమాధానం వారి నుంచి రావ డం లేదని ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి ఆన్లైన్ బుకింగ్ లేకపోవడంతో అవసరమైన కస్టమర్లు చే సేది లేక అడ్డదారుల్లోనే ఇసుకను కొనుగోలు చేస్తున్నా రు. ఇంటి నిర్మాణాలే కాకుండా ఏ చిన్న మరమ్మతులు చేసుకోవాలన్న ఇసుక తప్పనిసరి. ఈ క్రమంలో బ్లాక్‌లోనే కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్ బు కింగ్ నిలిచినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
దళారులకు ధనార్జనే..
ఐదు ఇసుక క్వారీల నుంచి ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని మాఫియా సరఫ రా చేసే ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. ఇష్టమొచ్చిన ధ రలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్లైన్లో దొరకని ఇసుక అడ్డదారుల్లో ఈజీగా అందుతున్నది. దీంతో అధిక ధరలకు కొనుగోలు చేసి వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు సమయానికి ఇసుక అందక కొందరు ఇబ్బందులు పడుతుం టే.. అధిక ధరలతో మరికొందరు తప్పక కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ అయితే రూ.2,500కే ట్రాక్టర్ ఇసుకను పొందే అవకాశం ఉన్నది. అదే బ్లాక్‌లో కొనుగోలు చేయాలంటే రూ.3 వేల నుంచి రూ.4వేల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కో ట్రాక్టర్‌పై రూ.1500 వరకు అదనంగా దళారులు వసూలు చేస్తున్నారు. దీంతో వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ప్రత్యామ్నాయాల కోసం..
ఆన్లైన్ బుకింగ్ నిలిచిపోయిన ఇసుక క్వారీల స్థా నంలో ప్రత్యామ్నాయాలను గుర్తించడం కోసం కలెక్టరే ట్ నుంచి ఆర్డీవో కార్యాలయానికి సి ఫారసు చేశారు. ఆర్డీవో పర్యవేక్షణలో తాసీల్దార్, జిల్లా గ్రౌండ్‌వాటర్ అ ధికారి, మైనింగ్ ఏడీ, జిల్లా సర్వే అధికారులు పరిశీలిం చి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్నది. నిలిచిన క్వారీల్లో ఆన్లైన్ బుకింగ్ అందుబాటులోకి రావాలంటే ఈ అధికారుల బృందం పరిశీలన చేసిన తర్వాత క్వారీలను గుర్తిస్తేనే సాధ్యమవుతుంది. గత నెల 9న ఈ బృందానికి ప్రత్యామ్నాయ క్వారీలను చూడాలని ఆదేశాలు జారీ అయినా అందుబాటులో లేవని, మరో నెల గడిస్తే గుర్తించే అవకాశం ఉన్నదని కలెక్టర్ కార్యాలయానికి తెలిపారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం..
ఇసుక ఆన్లైన్ బుకింగ్ లేకుండా నిలిచిన ప్రాం తాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. రీచ్‌ల ను ఏర్పాటు చేసేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ టీం కు సమాచారం అందించాం. ఆర్డీవో ద్వారా కమిటీ సభ్యుల బృందం పర్యవేక్షణ జరిపి ఇసుక తరలింపునకు అనుకూలంగా క్వారీలు లేవని రిపోర్ట్ ఇ చ్చింది. అయితే, ప్రత్యామ్నాయంగా క్వారీలను త ప్పనిసరి గుర్తించాల్సిందేనని కలెక్టర్ ఆదేశించారు. త్వరలోనే గుర్తించి అన్ని కేంద్రాల్లో ఆన్లైన్లో ఇసుక బుకింగ్‌లు జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– రమేశ్‌రెడ్డి, సూపరింటెండెంట్, వనపర్తి కలెక్టరేట్
ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావాలి
ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణాలకుగానూ అధికారులు ఇసుకకు అనుమతులిస్తున్నారు. కానీ సామా న్య ప్రజలకు మాత్రం ఇవ్వడం లే దు. గృహ నిర్మాణాలకు ఇసుక దొరకడం కష్టంగా మారింది. గతంలో దుప్పల్లి, కరివెన గ్రామాల్లో ఇసుక రీ చ్‌లు ఉండేవి. మీసేవలో ఐప్లె చేసుకుంటే అనుమతులు లభించేవి. ట్రా క్టర్ల ద్వారా ఇసుక తెప్పించుకునేవా ళ్లం. ఇప్పుడు రీచ్‌లు మూతపడడం తో ఇబ్బందులు పడుతున్నాం. ఇంటికి ఇసుక అవసరమైతే ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. మీసేవలో అడిగితే సైట్ పనిచేయడం లేదంటున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించి వెబ్సైట్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. గత్యంతరం లేక ఎడ్ల బండ్లపై ఇసుక తెప్పించుకోవాల్సి వస్తున్నది. ఒక్కో బండికి రూ.800 చొప్పున వసూ లు చేస్తున్నారు. తక్షణమే అధికారు లు స్పందించి ఇబ్బందులను తొలగించాలి.
– లక్ష్మీనారాయణ, దుప్పల్లి గ్రామం, మదనాపురం మండలం
ప్రైవేట్ వ్యాపారులు దోచుకుంటున్నారు..
ఆన్లైన్లో ఇసుక దొరకకపోవడంతో ఇల్లు కట్టుకునేందుకు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అది కూడా నాణ్యతగా ఉండడం లేదు. అయినా తప్పని పరిస్థితిలో కొనుగోలు చేయాల్సి వస్తున్నది. పది నెలలుగా పెద్దమందడి మండలంలో క్వారీలు తెరవకపోవడంతో ఆశలు వదులుకొని ప్రైవేట్‌గా వ్యాపారుల నుంచి కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నాను. ఆన్లైన్ ఇసుకకు, వ్యాపారస్తులకు రూ.500 వరకు ధరలో వ్యత్యాసం ఉంటున్నది. గతంలో మా గ్రామంలో ఆన్లైన్లో ఇసుక ను బుక్ చేయగా.. ఇంతవరకు రాలేదు, డబ్బులు కూడా తిరిగి రాలేదు. ఇప్పటికైనా అధికారులు ఇసుక రీచులు ఓపెన్ చేసి ఆన్లైన్ ఇసుకను అందుబాటులో ఉంచితే సౌలభ్యంతోపాటు నాణ్యవంతంగా ఉంటుంది.
– ముడావత్ కిషన్‌నాయక్, ముందరితండా, పెద్దమందడి మండలం
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

