జడ్చర్ల, జనవరి 25 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం వే రుశనగకు ధరలు తక్కువగా వేశారంటూ రైతులు ఆందోళనకు దిగిన అంశం తెలిసిందే. అయితే ధరలు తక్కువగా వచ్చాయని, ధరలు పెంచితేగాని తమ సరుకు ను ఇవ్వమని రైతులు బుధవారం అధికారుల కు తెలుపడంతో వారు వేరుశనగకు గురువా రం రీ టెండర్ వేస్తామని చెప్పి రైతులకు నచ్చజెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. అయితే బుధవారం అధిక ధరల కోసం ఆందోళనకు దిగిన రైతులు గురువారం రీ టెండర్ వే యక ముందే వేరుశనగకు బుధవారం వ్యాపారులు వేసిన ధరలకు అమ్ముకొన్నారు. అ యి తే ట్రేడర్లు మాత్రం గురువారం వచ్చిన సరుకుతోపాటు ఎవరైతే బుధవారం ధరలకు అ మ్ముకోకుండా ఉన్న రైతులకు సంబంధించిన సరుకులకు రీ టెండర్లు వే శారు. అయితే కొద్ది మంది మాత్రమే రీ టెండర్ వేయించుకొన్నా రు. గురువారం ఉదయం జిల్లా మార్కెటింగ్ అధికారిణి బాలమణి బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు వచ్చిన వేరుశనగను పరిశీలించారు.
అదేవిధంగా రైతులతో మా ట్లాడారు. ఈ సందర్భంగా డీఎంవో మా ట్లాడుతూ బుధవారం వేరుశనగకు తక్కువ గా ధరలు వచ్చాయని రైతులు ఆందోళన చేసిన క్రమంలో గురువారం రీ టెండర్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎక్స్ఫోర్టు లేనందున మార్కెట్‌ను బట్టి వ్యాపారులు ధరలు నిర్ణయించడం జరుగుతుందని, అదేవిధంగా ఆయిల్ కం టెంట్‌ను బట్టికూడా ధరలను వేయడం జరుగుతుందన్నారు. అయితే చాలా మంది రైతులు ఆరబెట్టకుండా వేరుశనగను మార్కెట్‌కు తీసుకురావడం వలన ధరలు తగ్గేందుకు అవకాశం ఉందన్నారు. రైతులు బాగా ఆరబెట్టి చెత్తాచెదా రం లేకుండా తీసుకువస్తే మంచి ధరలు లభిస్తాయని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెట్ అధికారులు ఇక్కడ పనిచేయడం జరుగుతుందన్నారు. జడ్చర్లలో ఇన్చార్జి కార్యదర్శి ఉన్నందున అతను రెండు మార్కెట్లను చూడటం వలన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రెగ్యులర్ అధికారిని నియమించాలని చెప్పగా పైఅధికారులకు తెలిపి రెగ్యులర్ కార్యదర్శిని నియమించేందుకు చర్య లు తీసుకుంటామని చెప్పారు. ఆమె వెంట మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు ధరలు తగ్గాయి. బుధవారం కంటే దాదాపు రూ.80 తగ్గాయి. బుధవారం మార్కెట్లో వేరుశనగకు అత్యధికంగా క్వింటా రూ.7,155ధర పలుకగా గురువారం క్వింటా రూ.7,079 ధర వచ్చింది. గురువారం మార్కెట్‌కు వేరుశనగ, కందులు, ధాన్యం, మొక్కజొన్న, బొబ్బర్లు అమ్మకానికి వచ్చాయి. మార్కెట్‌కు 2,860 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.7,079, కనిష్ఠంగా రూ.4,929, మధ్యస్తంగా రూ.6,3 85 ధర పలికింది. అదే విధంగా కందులు క్వింటాకు గరిష్ఠంగా రూ.9,789, కనిష్ఠంగా రూ.9,509, మధ్యస్తంగా రూ.9,6 99 ధర లభించింది. ఆర్ఎన్ఆర్ రకం ధా న్యానికి గరిష్ఠంగా రూ.3, 131, బొబ్బర్లు క్వింటాకు గరిష్ఠంగా రూ.6,789, మొక్కజొన్న క్వింటా గరిష్ఠంగా రూ.2,334ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు.