పెద్దమందడి : బీఆర్ఎస్ రజతోత్సవ( BRS Silver Jublee) సభకు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఉప్పెనల కదిలారు. ముందుగా ఆయా గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ( Flag ) ఎగరవేసి వరంగల్ సభకు బయలుదేరారు. పలువురు రైతులు మాట్లాడుతూ తెలంగాణకు కేసీఆర్ ( KCR ) శ్రీరామరక్ష అని, మళ్లీ కేసీఆర్ పాలన కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని అన్నారు.
మాయ మాటలు చెప్పి రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పుడు కూడా తెలంగాణలో గెలవదని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ తప్ప ఎవరికి చోటు లేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయి ఎంత తప్పు చేశామో అర్థం అయిందని వివరించారు. కేసీఆర్ పిలుపుమేరకు ఎంత దూరమైనా సభ తరలి వెళుతున్నామని పార్టీ మండల అధ్యక్షులు వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామాల అధ్యక్షులు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.