మాగనూరు : భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ( BR Ambedkar ) సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి (Seetha Dayakar Reddy ) అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మాగనూరు మండలంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఉజ్జలి గ్రామంలో కొనసాగుతున్న బీరప్ప బండారు మహోత్సవం, అంబేద్కర్ జయంతి వేడుకలలో చైర్పర్సన్ పాల్గొని మాట్లాడారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్యం, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వర్ధిల్లడం వెనుక అంబేద్కర్ కృషి ఎంతో ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రహమతుద్దీన్ ఎస్సై అశోక్ బాబు, సిద్ధార్థ రెడ్డి , బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీఐటీయూ, అంబేద్కర్ యువజన సంఘం అఖిలపక్ష నాయకులు మధుసూదన్ రెడ్డి, జయనాథ్ రెడ్డి, నారాయణ, అశోక్ గౌడ్, ఆనంద్ గౌడ్, పల్లె మారెప్ప, లక్ష్మణ్, సగరం వెంకటేష్, సగరం మహేష్, ఆనంద్ ,రవికుమార్, సోమశేఖర్ గౌడ్, బీజేపీ మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల అధ్యక్షుడు నల్లే నరసప్ప, మాజీ ఎంపీటీసీ మౌలాలి, తదితరులు పాల్గొన్నారు.