మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 7 : జిల్లా కేంద్రంలోని రాయిచూరు రోడ్డులోని హజ్రత్ సయ్య ద్ అబ్దుల్ ఖాదర్‌షా సాహెబ్ రహెమాతుల్లా అలై దర్గా 85 ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధోత్సవ వేడుకలు ముత్తవల్లి మహ్మద్ అబ్దుల్ జమీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముత్తవల్లి షేక్బడేసాబ్ ఇంటి నుంచి ఒంటెపై బయలు దేరిన గంధోత్సవ ఊరేగింపు అశోక్‌టాకీస్ చౌరస్తా, ఎస్బీహెచ్ రో డ్డు, తూర్పుకమాన్, పోలీస్ క్లబ్ నుంచి వన్‌టౌన్ చౌరస్తా గుండా దర్గాకు తీసుకెళ్లారు. గంధోత్సవానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మగ్రిబ్నమాజ్ అనంతరం దర్గాలో చాదర్ సమర్పించి ఫాతేహాలు అందజేశారు. ఉత్సవాల్లో రాయిచూర్, నారాయణపేట, హైదరాబాద్, గద్వాల ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు.