బిజినేపల్లి, జనవరి 19 : మారుమూల గ్రామాల్లోని పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌పాండే తెలిపా రు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని సల్కర్పేటలో శుక్రవారం నిర్వహించిన వికసిత్ భా రత్ సంకల్ప యాత్రకు ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. రాష్ట్రంలో 17 శాతం రైల్వే విస్తరణ పను లు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి తిరుపతి కి వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారన్నారు. త్వరలోనే నాగర్‌కర్నూల్ జిల్లా మీదు గా రైలుమార్గాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చా రు. తెలంగాణలో హైవేల విస్తరణ కోసం ఇప్పటివరకు రూ.1.02 లక్షల కోట్లను ఖర్చు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలోనూ ఆయుష్మాన్ పథకం అమలు చేస్తున్నామన్నారు.
యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 12 లక్షల మంది కి ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందించినట్లు వివరించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రాజ్కుమార్మిశ్రా మాట్లాడుతూ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతుందన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు చెక్కులను అందజేశారు. అం తకు ముందు స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్, యూనియన్ బ్యాంక్ బీజీఎం సత్యనారాయణ, డీఆర్డీఏ నర్సింగరావు, నాబార్డు డీడీఎం అఖిల్, ఎల్డీఎం కౌశల్ కిశోర్పాండే, డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, నోడల్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సు ధాకర్‌రావు, దిలీపాచారి, సర్పంచ్ చంద్రకళ, రా ములు, ఎంపీటీసీ అంజి పాల్గొన్నారు.