జడ్చర్ల, నవంబర్ 9 : జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నామినేషన్‌ను అట్టహాసంగా వేశారు. గురువారం ఉదయం జడ్చర్ల మడంలంలో ని గంగాపూర్ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆ లయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కుర్వగడ్డపల్లి వద్ద గ ల పర్శవేదీశ్వరస్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించారు. నాగసా ల గ్రామ శివారులోని ఆంజనేయస్వా మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం జడ్చర్లలోని లక్ష్మారెడ్డి స్వగృహం నుంచి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్లతో కలిసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ లో జడ్చర్ల, నవాబ్‌పేట, రాజాపూర్, బాలానగర్, ఊర్కొండ, మిడ్జిల్ మండలాల నుంచి పార్టీ నా యకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి ఇంటి నుంచి అంబేద్కర్ చౌరస్తా వర కు భారీ ర్యాలీ నిర్వహించారు.
మహిళలు బతుకమ్మ, బొడ్డెమ్మలను ఆడా రు. యువతులు కోలాటం వే సి అలరించారు. డప్పులమోతలు, యువకుల నృత్యాలు, కళాకారుల ఆటపాటలతో డీజే పాటలతో ర్యాలీ నిర్వహించడంతో వియోత్సవ ర్యాలీని తలపించింది. ర్యాలీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు స్వరణ్‌రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజపరిచారు. ర్యాలీ అనంతరం జడ్చర్లలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్లు వేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, వైస్‌చైర్మన్ దానిశ్, రాష్ట్ర సంగీతనాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, సర్పంచుల సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, న్యాయవాది జంగయ్య, సర్పంచులు రా జేశ్వర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీ నివాసులు, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, నందకిషోర్‌గౌడ్, జె డ్పీటీసీ కల్యాణి పాల్గొ న్నారు.