ఊటూర్, జూలై10: ఆశ కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిషరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ నారాయణ అన్నారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు కనీసవేతనం రూ.26,000 అమలుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వివి ధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసీల్దార్ మమతకు అందజేశారు. కార్యక్రమంలో నారాయణ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవరకద్ర, జూలై 10 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలంచెందిందని సీఐటీయూ జిల్లాఉపాధ్యక్షుడు వేణుగోపాల్ అన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తు బుధవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందచేశారు.
బాలానగర్, జూలై 10: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం స్థానిక తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సీఐటీయూ నాయకుడు దీప్లానాయక్ అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసీల్దార్ శ్రీనివాసరెడ్డికి అందజేశారు.
మక్తల్, జూలై 10: కార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టే నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలని కోరుతూ బుధవారం మక్తల్ డిప్యూటీ తాసీల్దార్కు అంగన్వాడీ ఆశ కార్యకర్తలతో కలిసి సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ గోవిందరాజు మంజుల, విజయలక్ష్మి ఉన్నారు.
మాగనూర్, జూలై 10: స్థానిక తాసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించి, తాసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కో కన్వీనర్ ఆంజనేయులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సూర్యప్రకాశ్, శివకుమారి ఉన్నారు.
నారాయణపేట, జూలై 10 : కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దస్తప్ప డిమాండ్ చేశారు. బుధవారం అఖిల భారత కార్మికదినం సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశ) యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్పార్క్ వద్ద ధర్నా చేశారు. అనంతరం ఉపతాసీల్దార్ నా రాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బాలమణి, పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనకార్మికులు ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
జడ్చర్ల, జూలై 10 : కార్మికుల డిమాండ్స్డే సందర్బంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం జడ్చర్లలోని తాసీల్దార్ కార్యాయం దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి తెలుగు సత్యయ్య, వెంకటేశ్ సరోజ ఉన్నారు.
మరికల్, జూలై 10: మరికల్లోని తాసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా, అంగన్వాడీ టీచర్లు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు బాలప్ప మాట్లాడారు. అనంతరం తాసీల్దార్ సునీతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అనురాధ, కవిత, మహేశ్వరి, శశికళ,ఆశా,సులోచన ఉన్నారు.
ధన్వాడ, జులై 10: ధన్వాడలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణయ్య, చంద్రకళ, సుమిత్ర, అనురాధ, అంజలి, యశోధ, మాసనమ్మ, మంగమ్మ, ఉదయభాను, బాలకృష్ణ, రమేశ్ పాల్గొన్నారు.