మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 22 : అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లాలో యూనివర్సిటీ స్థాపించడం పాలమూరు విద్యార్థులకు వరంగా మారింది. 2008-09 జూలై 27న పాలమూరు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నది. 2018లో పీయూ న్యాక్‌కు వెళ్లగా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఆన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ద్వారా ‘బి-గ్రేడ్’ లభించింది. న్యాక్ గడువు ముగియడంతో మరోసారి న్యాక్‌కు దరఖాస్తు చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే ఈనెల 23, 24, 25 తేదీల్లో వర్సిటీని నాక్ బృందం సందర్శించనున్నది.
పాలమూరు విశ్వవిద్యాలయం ఏర్పడి 16 ఏండ్ల్లు అవుతున్నది. అప్పటి నుంచి ఇప్పటి వర కు ఎన్నో విశిష్టతలకు నిలయంగా మారింది. అ ధ్యాపకులు, విద్యార్థులు జాతీయస్థాయిలో గుర్తిం పు పొందారు. జాతీయ సేవా పథకం ద్వారా బేర్ఫుట్వాక్ అనే అంశంలో గిన్నిస్ రికార్డు సాధించింది. సాహస శిబిరంలో విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిం ది. ప్రశంసా బుక్ ఆఫ్ రికార్డు వారు విశ్వవిద్యాలయానికి ‘మహా మహా’ అనే బిరుదును ఇచ్చా రు. సంఘమిత్ర అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా, యంగ్ సైంటిస్టులుగా పీయూ అచార్యులు, అధ్యాపకులు ఉత్తమ ప్రశంసలు అందుకున్నారు.
పాలమూరు యూనివర్సిటీ మొత్తం 171ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నది. మొదట ఐదు విభాగాలతో ప్రారంభమైన ప్రస్తుతం 21విభాగాలకు విస్తరించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పీయూ పరిధిలో 90డిగ్రీ కళాశాలలు, 18 పీజీ కళాశాలలు, 29 బీఈడీ కళాశాలలు, 3 ఇంటిగ్రేటెడ్ బీఈడీ, 3 ఎంఈడీ, 3 బీ పెడ్, 6 ఎంబీఏ, 1-ఎంసీఏ, 3-ఫార్మసీ, 1-లా కళాశాలలు ఉండగా, 65వేలకు పైగా విద్యార్థులతో కొనసాగడంతో పాటు యూజీ, పీజీ, డిగ్రీ పరీక్షలను యూనివర్సిటీ ద్వారానే చేపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్‌ను పాలమూరు యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ 2008 లో జిల్లాకు విశ్వవిద్యాలయాన్ని అనుమతించా రు. 2008-09 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంఏ పాలిటిక్స్, ఎమ్మెల్సీ కోర్సులతో ప్రారంభమైం ది. అనంతరం కొన్నిరోజులకే ఎంఏ ఇంగ్లిష్, ఎం ఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ మైక్రో బయాలజీ కోర్సులను ప్రవేశ పెట్టారు. ప్రసుతం పీయూలో 19 రకాలైన కోర్సు లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా ఫిజికల్ ఆచార్యుడికి ఉప కులపతిగా అవకాశం కల్పించారు. ఇది దేశ చరిత్రలోనే ప్రప్రథమం. అనంతరం పీయూలో కొత్తగా పరిశోధన కేంద్రం ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోనే అతిపెద్ద సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌ను రూ.9కోట్లతో ఏర్పాటు చేశారు.
పీయూ క్యాంపస్‌లో పీజీ కాలేజ్, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉన్నాయి. పీయూ పరిధిలో వనపర్తి, జోగుళాంబ-గద్వాల, కొల్లాపూర్ పీజీ సెంటర్లు ఉన్నాయి. వర్సిటీలో ఆర్ట్స్, సైన్స్ కళాశాల భవనం, కామర్స్ మేనేజ్మెంట్ భవనం, అడ్మినిస్ట్రేషన్ భవనం, ల్రైబ్రరీ, ఆడిటోరియం, ఆకాడమిక్ బ్లాక్, పాలమూరు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ భవనాలు, యూనివర్సిటీ పీజీ కళాశాల హాస్టల్, సైన్స్ బ్లాక్, హెల్త్ సెంటర్, ఉమెన్స్ హాస్టల్, లైబ్రరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ హాస్టల్, పరీక్షల విభాగం, వీసీ రెసిడెన్స్ ఇలా అనేక రకాలైన భవనాలు ఉన్నాయి.
న్యాక్ గుర్తింపు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధు లు, ప్రాజెక్టులు ఇస్తుంది. విదేశాల్లోని వర్సిటీలు ఎంవోయూ చేసుకునేందుకు న్యాక్ గ్రేడ్‌నే చూస్తున్నాయి. యూజీసీ సైతం దీని ఆధారంగానే విద్యా సంస్థలకు వెసులుబాటు ఇస్తుంది. ఉన్నత విద్యా ప్రమాణాలు, ప్రయోగాలు, పరిశోధనల ఆధారం గా విద్యా సంస్థల వర్గీకరణ. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అవసరమైన సాంకేతిక అంశాలు నేర్చుకునే అవకాశం. ఉన్నత విద్యార్హతలు కలిగిన అధ్యాపకులతో బోధన, రూసా, తదితర గ్రాంట్లు పొందవచ్చు. ప్రాంగణ నియామకాలు చేపడుతారు.
మెరుగైన ర్యాంక్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. పాలమూరుకు న్యాక్ గ్రేడింగ్ గర్వకారణం కానున్నది. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకు ఈ గ్రేడింగ్ అత్యంత ప్రధానం. ఐదేండ్ల్ల పాటు దీని ద్వారా అనేక రకాలైన ఉపయోగాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న బీ-గ్రేడ్ నుంచి ఏ ప్లస్ గ్రేడ్ కోసం సమిష్టి కృషిచేస్తున్నాం. బోధన, పరిశోధనలతో యూనివర్సిటీ మంచి గ్రేడ్ సాధిస్తామనే నమ్మకం ఉంది.
-శ్రీనివాస్,వీసీ, పాలమూరు యూనివర్సిటీ.