ప్రశ్నాపత్రం లీకువీరుడు, బీజేపీ స్టేట్ చీఫ్ బండి నిర్వాకంపై పేరెంట్స్ భగ్గుమన్నారు. నీ రాజకీయ లబ్ధి కోసం ‘పది’ హిందీ పరీక్ష పత్రాల లీకేజీకి సహకరించి ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులకు శిక్ష వేస్తావా..? అని ప్రశ్నించారు. ఉపాధ్యా యుల మనోధైర్యం కోల్పోయేలా వ్యవహరించారని టీచర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల బండి దిష్టిబొమ్మను దహనం చేశారు. పేపర్‌లీకేజీ ఘటనలో పోలీసులు తీసుకున్న చర్యలను జనం హర్షిస్తున్నారు. ఎంతటి వారైనా వదిలి పెట్టకుండా దర్యాప్తు చేసి వారితో కటకటాలు లెక్కిస్తున్న పోలీసుల తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పదో తరగతి హిందీ పరీక్షా పత్రాల లీకేజీకి సహకరించిన బీజేపీ స్టేట్ చీఫ్‌పై ఉమ్మడి జిల్లా భగ్గుమంటున్నది. రాజకీయం స్వలాభం కోసం చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ దిష్టిబొమ్మను ద హనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పేపర్‌లీకేజీ ఘటనలో ఎంతటివారినైనా వదిలిపెట్టకుండా దర్యాప్తు చేసి కటకటా ల వెనక్కి తోయడంతో పోలీసుల తీరును ప్రజలు హర్షిస్తున్నారు. కాగా, తమ పార్టీ అధ్యక్షుడు ఈ చర్యకు పాల్పడడంతో ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు మొ ఖం చాటేస్తున్నారు. తాము బయట తిరగలేకపోతున్నామని ఓ బీజేపీ నేత వాపోయా డు. బండి సంజయ్ జైలుకు వెళ్లినా.. పాలమూరులో బీజేపీ ఆవిర్భావ వే డుకలు నిర్వహించడం గమనార్హం.
ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి.. ప్ర భుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయిన బండి వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, ట్యూషన్లకు వెళ్లి బాగా ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఈ లీక్ స మాచారం ఆందోళనకు గురిచేస్తున్నదన్నారు. పరీక్ష మంచిగా రాసి ఇంటికి వచ్చి పేపర్ లీక్ అయిందంటగా.. వాయిదా వేస్తారా? అని అమాయకంగా పిల్లలు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయామంటున్నారు. బాధ్యతగల ప్రజాప్రతినిధి ఇలాంటి చ ర్యలకు పాల్పడడం సిగ్గుచేటంటున్నారు. పేపర్ లీక్ అయిన సెంటర్లోని ఉపాధ్యాయులు ఎంత మనోవేదనకు గురయ్యారో బీజేపీ నేతలకేం తెలుసని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పోలీసుల దర్యాప్తులో ఇదంతా కావాలనే జరిగిందని తేలడంతో ఉపాధ్యాయులు సంతోషపడ్డారని, ప్రభుత్వం వేగంగా స్పందించి దోషులను పట్టుకున్నదని అంటున్నారు.
‘బండి’ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ నే తలు దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చా రు. మోదీని విమర్శించిన రాహుల్‌గాంధీకి జైలు శిక్ష విధించి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిన కేంద్రం.. ఈ వ్యవహారంలో కూడా బండి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత లేదంటున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం ఆడిన బండిని పర్మినెంట్‌గా జైలులోనే ఉంచాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతలు సైలెంట్‌గా ఉండడం చూ స్తుంటే.. అందరూ కలిసే ప్లాన్ వేశారని అర్థం అవుతుందంటున్నారు.
పేపర్ లీకేజీ విషయంపై గిల్టీగా ఫీలవుతున్నాం. ఉపాధ్యాయులను సర్వీస్నుం చి తొలగించడంలో పునరాలోచించా లి. పరీక్ష వాయిదా లేదా రద్దు చేయ డం వల్ల రిజల్ట్‌పై ప్రభావం పడు తుంది. రాజకీయ నాయకుల కుట్ర ల్లో ఉపాధ్యాయులు బలి పశువులవుతున్నారు. కొందరు చేసిన పొరపాటు వల్ల ఉపాధ్యాయ లోకానికే మచ్చ పడుతుంది. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
– సోమసుందర్‌రెడ్డి, ఏజీటీయూ జిల్లా అధ్యక్షుడు, జోగుళాంబ గద్వాల
బీఆర్ఎస్ సర్కార్‌ను బద నాం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. వారి కుతంత్రాలకు ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షా లు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రం లీకేజీలో ప్రభుత్వం పాత్ర ఉందని దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలన్న ఉద్ధేశంతో టెన్త్ హిందీ పరీక్షాపత్రం లీకేజీకి బీజేపీ నాయకులు పన్నాగం పన్నారు. వారి అనుచరులతో పేపర్ లీక్ చేయించి ప్రభుత్వం మీద నింద వేశారు. ఇలాంటి దుశ్చర్యలతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యే ప్రమాదముంది. ఇందులో ప్రధాన సూత్రధారి అయిన బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం సరైనదే. ఇకపై విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు.
– ఉరుకుందు, విద్యార్థి తండ్రి, సంకాపురం,
పదో తరగతి ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఇది లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేస్తున్నది. ప్రతి విద్యార్థికి పదో తరగతి పరీక్షలు మొదటి మైలురాయి. అటువంటి సున్నిత అంశాలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం దుర్మార్గం. పేపర్ లీకులో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారనేది దిగ్భ్రాంతికరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించడం అభినందనీయం.
– శ్రీధర్‌శర్మ, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నాగర్‌కర్నూల్
టెన్త్ పరీక్షలు ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా జరిగాయి. ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో కొంతమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ పేపర్ లీకేజీకి పాల్పడుతున్నారు. ఏడాదంతా చదివిన విద్యార్థులు పేపర్ లీక్‌తో అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉన్నది. రాజకీయంగా లబ్ధిపొందేందుకు విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యలో భాగంగా పరీక్షల నిర్వహణలో నిబంధనలు కఠినతరం చేయాలి.
– రవీందర్, విశ్రాంత ఉద్యోగి, గద్వాల
టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీలో బీజేపీ నాయకత్వం రాక్షసానందం పొందుతున్నది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను బదనాం చేసే కుట్రలో భాగంగానే పేపర్లను లీక్ చేసి బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్న బీజేపీ నాయకులకు విద్యార్థుల తల్లిదండ్రులు తగిన గుణపాఠం చెబుతారు. రాజకీయ లాభం కోసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడమేంటి..?
– గణేశ్, బీఆర్ఎస్వీ నాయకుడు, కల్వకుర్తి