మహబూబ్‌నగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణానదిపై గద్వాల జిల్లాలో నిర్మించిన జూరాల ప్రాజెక్టు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ఐరన్ రోప్ వే తెగిపోయినా ప్రభుత్వం సైలెంట్‌గా ఉన్నది. ఉ మ్మడి జిల్లాకు చెందిన మంత్రులు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయంపై నోరు మెదపడం లేదు. జూరాల ప్రాజెక్టు గేట్ల పై విమర్శలు వస్తున్న కనీసం ఏం జరిగిందో తెలుసుకునే ప్ర యత్నం కూడా చేయడం లేదు. గద్వాలకు చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎందుకో బీఆర్ఎస్ వాళ్లు జూరాలకు వచ్చిపోయారు అంట కదా అంటూ మీడియా ముందు సెటై ర్లు వేశారు. మరమ్మతుల్లో జాప్యం కారణంగా నాలుగు క్రస్టు గేట్ల ఐరన్ రోప్‌వేలు తెగిపోయినా అధికార యంత్రాంగం కూ డా మౌనం దాల్చింది. కాగా జూరాల ప్రాజెక్టుపై రాకపోకల కారణంగా కూడా ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిం దని.. తాజాగా తెరమీదకు దిగువ జూరాలపై కొత్తగా వంతెన నిర్మించాలని ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. రాకపోకలను నిషేధించి ప్రాజెక్టు కింది భాగంలో కొత్తగా బ్రిడ్జి కట్టాలని గతంలో ప్రతిపాదించిన సాధ్యం కాకపోవడంతో దాన్ని పక్కన పెట్టేశారు. తాజాగా మళ్లీ ఈ ప్రతిపాదనను అధికారులు తెరమీదకు తీసుకురావడంతో జూరాలలో ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రాజెక్టులోని 64గేట్లలో అనేక గేట్లలో లీకేజీలు ఆన కట్ట సామర్థ్యాన్ని కుంగ దీస్తున్నాయి. స్పిల్ వే నుంచి వెళ్లా ల్సిన నీళ్లు ఏకంగా గేట్ల నుంచి వెళ్తున్నా ఇటు సర్కార్ అటు అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మరోవైపు జూరాల ప్రాజెక్టులో రోజురోజుకు పూడిక పెరిగిపోతున్నది. గతంలో పూడిక తీస్తే ప్రాజెక్టు నిలువ సామర్థ్యం పెరిగే అవ కాశం ఉందని నివేదికలు ఇచ్చినా ఉమ్మడి రాష్ట్రంలో సర్కార్ దీన్ని తొక్కి పెట్టింది. కేసీఆర్ హయాంలో అనేకసార్లు జూరాల ప్రాజెక్టు పూడిక తీయాలని ప్రయత్నించిన వరుసగా కురిసిన భారీ వర్షాలు ఆ పనులకు అడ్డంకిగా మారాయి. క్రస్ట్ గేట్ల రోప్ వేలు తెగడం.. భారీగా ప్రాజెక్టు నుంచి లీకేజీలు ఏర్ప డడం.. పేరుకుపోతున్న పూడికతో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నా ర్థకంగా మారింది. వీటన్నింటి నుంచి దృష్టి మరల్చడానికి రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం జూరాల ప్రాజెక్టుకి వస్తున్నట్లు సమాచారం.
1981లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ పడగా.. దాదాపు 15 ఏండ్ల తర్వాత 1996లో పూర్తయింది. టీడీపీ హయాంలో ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్నప్పటికీ చంద్రబాబు హడావిడిగా దీన్ని ప్రా రంభించారు. ప్రాజెక్టు పూర్తయి 30 ఏండ్ల్లు గడుస్తున్నా మరమ్మతులు మాత్రం జరగడం లేదు. ప్రాజెక్టు ఆనకట్ట సైతం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇటు ఆత్మకూరు నుం చి అటు గద్వాలకు రహదారి నిర్మాణం చేపట్టిన అందులో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వలు సైతం కొంత దూరం వరకు లైనింగ్ వేశారు. మిగతా చోట్ల కాల్వల నిర్మాణం కూడా సక్రమంగా జరగక పోవడంతో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు అందించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 64 గేట్లలో దాదాపు 20 గేట్ల వరకు భారీగా లీకేజీలు ఉన్నాయి. వరద వచ్చినప్పు డు పరవాలేదు కానీ.. మామూలు టైంలో కూడా ఈ లీకేజీల వల్ల నిలువ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతున్నది. ప్రస్తుతం 22, 23, 27, 28, 33, 35, 36, 37, 40, 41, 42, 49, 56, 57, 58 గేట్లలో లీకేజీలు ఉన్నట్లు అధికార యంత్రాంగం ధ్రువీకరించింది. దీంతో నిరంతర లీకేజీల వల్ల ప్రాజెక్టు ఆనకట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
జూరాల ప్రాజెక్టు రెస్ట్ గేట్ల వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గేట్ల ఐరన్ రోప్ వేలు తెగిపడడంతో గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో ఉమ్మడి జి ల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈ వ్యవహారంపై ఆరా తీయ కపోవడం విమర్శలకు తావిస్తోంది. కొల్లాపూర్‌కు చెందిన సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు.. గద్వాల జిల్లాకు ఇన్ చార్జ్జిగా ఉన్నారు. ఇటీవలే మంత్రివర్గంలో స్థానం పొందిన వాకిటి శ్రీహరి నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు పరిధి ఉన్నది. ఇద్దరు మంత్రులు కూడా ఇంత జరుగుతున్నా అధికారులతో కూడా వివరాలు తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు.. సుప్రీం కోర్టులో కేసు కారణంగా ఆయన పార్టీ కార్య క్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలపైనే ఆయన సెటైర్లు వేశారు.
జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లా సరిహద్దుల్లో నిర్మించిన జూరాల ప్రాజెక్టుపై రెండు జిల్లాలను కలుపుతూ రహదారిని ఏర్పాటు చేశారు. ఈ రహదారిపై భారీ వాహనాలు మిన హాయించి ఆర్టీసీ బస్సులు, కార్లు, డీసీఎంలు బైకులు నిరం తరం తిరిగేలా రోడ్డు నిర్మించారు. అయితే జూరాల ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్నప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం హడా విడిగా దీన్ని ప్రారంభించింది. ఆనకట్టకు ఇంకా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. ప్రాజెక్టును ప్రారంభి ంచారు. ఆనకట్టపై రహదారి నిర్మాణం వాహనాల రాక పోకల వల్ల కూడా ఆనకట్ట మరింత బలహీన మవుతుందని అప్పట్లోనే ఇంజినీర్లు హెచ్చరిం చారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్కార్ వీటి అన్నిం టినీ పెడచెవిన పెట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయింది. అప్పటి నుంచి సరైన మరమ్మతులు చేయక పోవడంతోపాటు రహదారి నిర్మాణం వల్ల ఆనకట్ట దెబ్బ తినే ప్రమాదం ఉందని గతంలోనే దిగు వ జూరాలలో కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీన్ని ఉమ్మ డి రాష్ట్రంలో తిరస్కరించారు. తాజాగా గేట్ల రోప్‌వేలు తెగిపోవడం.. లీకేజీలు.. పూడికతీతలు.. ఆనకట్ట మరమ్మతులు ఇతర కారణాల వల్ల తెరమీదకు మళ్లీ ఈ కొత్త బ్రిడ్జి ప్రతిపాదనను అధికార యంత్రా ంగం తీసుకువచ్చింది. రాకపోకలను పైనుంచి నిషేధించి కింది నుంచి కొత్త బ్రిడ్జి నిర్మిస్తే ప్రాజెక్టు పటిష్టంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటు న్నారు. దీని సాధ్యాసాధ్యాలపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉన్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ప్రాజెక్టు భవిత వ్యంపై నీలినీడలు కమ్ముకున్నా అధికార యంత్రాంగం మాత్రం ముందుకు వెళ్లడం లేదు. మీడియాలో క్రాఫ్ట్ గేట్ల వ్యవహారంపై కథనాలు వస్తున్న ఉన్నతాధికారులు ఎక్కడా స్పందించడం లేదు. ఇదేదో మామూలు వ్యవహారం లాగా కొట్టి పడేస్తున్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్ణయం లేనిదే మీడి యాకు ఎలాంటి వివరాలు ఇవ్వరాదని ఆదేశాలు వచ్చాయి. అంతేకాకుండా వచ్చిన కథనాలపై హడావిడి చేయకుండా ఉండాలని కూడా ఉన్నత అధికా రులు సూచించినట్లు సమాచారం. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు.
గద్వాల, జూన్ 27 : జూరాల ప్రా జెక్టు నిర్వహణలో ప్రభుత్వం నిర్ల క్ష్యం వహించడం వల్లే భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్‌కుమార్ ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి సాగును బాగు చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ప్రాజెక్టులను పడావు పెట్టి.. నిర్వహణ గాలికొదిలి.. ఏపీకి నీళ్లు విడుదల చేస్తున్న ఘన త ప్రస్తుత సీఎం రేవంత్‌దే అన్నారు. ఏడాదిన్నర పాలనలో కృష్ణానదిపై జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు ప్రజాపాలన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శమన్నారు. జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్స్ తెగిపోయి, అధికారులు హెచ్చరించినా ప్రభుత్వం నిమ్మకుండి పోయిందని ఆరోపించారు. పాలమూరు బిడ్డ సీఎం ఉన్నాడనుకుం టే ఆయనే ఇక్కడి ప్రాజెక్టులపై పగబట్టాడని దుయ్యబట్టారు. డ్యాంపై భారీ వాహనాలు అనుమతించకుండా ప్రత్యామ్నాయంగా రవాణా కోసం మరో బ్రిడ్జిని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే గేట్ల రోప్‌వే మరమ్మతులు చేయించి, ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. పీఆర్ఎల్ఐలో 10 శాతం పనులు పూర్తి చేయాలన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏకైక సాగునీటి ప్రాజెక్టు అయినా జూరా ల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ప్రమాదంలో ఉన్న మాట వాస్తవమే. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం విచారణ జరిపిస్తే మొత్తం వ్యవహారం బయట పడుతున్నది. ప్రాజెక్టు గేట్లు ప్రమాదంలో ఉన్నాయి. యేటా మరమ్మతులు చేయాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మరమ్మతులపై దృష్టి సారించలేదు. దీని వల్ల ప్రాజెక్టుకే ప్రమా దం ఏర్పడుతుంది. జూరాల ప్రాజెక్టు కు వర ద వస్తున్న మక్తల్ నియోజకవర్గంలోని భీమా.. దేవరకద్ర నియోజకవర్గంలోని కోయిల్‌సాగర్ పథకాలకు నీళ్లు అందించడం లేదు.. వెంటనే ఇవ్వకుంటే ఆందోళన నిర్వహిస్తాం.
– చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మక్తల్