బల్మూరు, జూన్ 9 : నూతన దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్మూరు మండలం జినుకుంటలో చోటుచేసుకున్నది. ఏఎస్సై రేణయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహేశ్(21), భానుమతి(18) ప్రేమించుకొని ఆరు నెలల కిందట వివాహం చే సుకున్నారు. వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఈక్రమంలో భానుమతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మహేశ్ కొంతకా లం జైలుకు వెళ్లి వచ్చాడు. ఈక్రమంలో శనివారం రాత్రి ఇంట్లో గొడవపడిన దంపతులిద్దరూ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం అచ్చంపేట ప్రభుత్వ ద వాఖానకు తరలించారు. మృతురాలి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. కాగా గ్రా మంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏ ర్పాటు చేశారు.