అలంపూర్ : దేశానికి, సమాజానికి ఎంతో మేలు చేసిన మహనీయుల భావజాలాన్ని ( Ideology ) ముందుకు తీసుకెళ్లాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం సుల్తానాపురం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్( Ambedkar ) , మహత్మా జ్యోతిరావు ఫూలే ( Jyotirao Phule) , సావిత్రిభాయి పూలే (Savitribai Phule ) విగ్రహాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రమే చెందినవాడు కాదని అందరివాడని అన్నారు. ఆయన్ను ఒక్క కులానికో, వర్గానికో పరిమితం చేసే కుట్ర కొంతకాలంగా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి గుడిసెకు, ప్రతి దళితుడికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిన నాడే అంబేద్కర్ కల సాకారమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కిశోర్, అంబేద్కర్ కమిటీ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.