కోడేరు నవంబర్ 19 : కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కళాకారుని మధుప్రియ పాడిన గులాబీల జెండలమ్మ రామక పాటకు సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలు కేరింతలు కొడుతూ హోరెత్తారు. గాయని మధుప్రియ పాట పాడుతున్న అంతసేపు మహిళలు యువకులు రైతులు వివిధ వర్గాల ప్రజలు గులాబీ కండువాలు జెండాలు ఊపుతూ సభలో నృత్యాలు చేశారు. ప్రజా ఆశీర్వాద సభావేదిక పైకి సీఎం కేసీఆర్ రాగానే ప్రజలు చప్పట్లతో ఈలలతో కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా మధ్య మధ్యలో యువకులు మహిళలు పెద్దఎత్తున జై తెలంగాణ అంటూ జై కెసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కళాకారుల ఆటపాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకు న్నాయి.
మా పాలిట పెద్ద కొడుకైన సీఎం కేసీఆర్‌ను సూడనీక వచ్చిన. ఆయన అందిస్తున్న పింఛన్‌తో మాకు ఎంతో ఆదెరువుగా ఉంది. మరోసారి ఆయన గెలిస్తే పింఛన్ ఐదు వేలు ఇస్తనని చెప్పుడు చాలా గొప్పది. కాంగ్రెస్‌పాలనలో మాకు పింఛన్ 200 మాత్రమే వచ్చేయి. ఆ పైసలు మాకు ఏమాత్రం సరిపోకపోయేవి. ఇప్పుడు ఇస్తున్న రెండు వేల పింఛన్‌తో హాయిగా ఉన్నాం.
కల్వకుర్తి పట్టణానికి సీఎం కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ విజయం ఖాయమైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి లక్షా యాభై వేల ఎకరాలకు సాగు నీరందిస్తానని చెప్పడంతోసీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని మరోసారి రుజువైంది. నిత్యం ప్రజలలో ఉండే జైపాల్ యాదవ్‌ను ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం
కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రావడంతో నాయకుల్లో కొత్త జోష్‌ను నింపింది. ఆయన ప్రసంగంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయంగా మారింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతోప్రతి పక్షాలకు గుబులు పుట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుని సీఎం కానుకగా అందిస్తాం.
పింఛన్ ఇచ్చి మాలాంటోళ్లను ఆదుకుంటున్న దేవుడు సీఎం కేసీఆర్. గతంలో కాంగ్రెసోళ్లు రూ.200 పింఛన్ ఇచ్చేవారు. ఆపైసలు మాకు దేనికి సరిపోయేది కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 200 ఉన్న పింఛన్‌ను రూ.2వేలు చేసిన దేవుడు. ఈసారి కేసీఆర్ మళ్లీ గెలిస్తే రూ.5వేలు ఇస్తానంటున్నాడు. అందుకే ఈ సారి కూడా మా ముసళ్లోలం అంత కారుగుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను గెలిపిస్తాం..