మహబూబ్‌నగర్ అర్బన్/నాగర్‌కర్నూల్/వనపర్తి/ నారా యణపేట, జూన్ 15 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ కలెక్టర్ రవినాయక్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయేంద్ర బోయి సోమవా రం మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
నాగర్‌కర్నూల్ నూతన కలెక్టర్‌గా 2016 బ్యాచ్‌కు చెందిన బడావత్ సంతోష్ రానున్నారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన ఉదయ్‌కుమార్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో మంచిర్యాల కలెక్టర్‌గా ఉన్న బడావత్ సంతోష్ రానున్నారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ అదనపు (స్థానిక సంస్థలు) కలెక్టర్‌గా ఉన్న కుమార్‌దీపక్ పదోన్నతిపై మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
వనపర్తి కలెక్టర్‌గా ఆదర్శ సురభి నియమితులయ్యారు. ఆదర్శ సురభి 2018 ఐఏఎస్ బ్యాచ్ కాగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ తొలిసారిగా వనపర్తి కలెక్టర్‌గా నియమితులయ్యారు. తేజస్‌నందలాల్ పవార్ 2023 ఫిబ్రవరి 1న వనపర్తి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి విజయవంతం చేశారు.
నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్ నియమితులయ్యారు. 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నారాయణపేట కలెక్టర్‌గా పనిచేస్తున్న కోయ శ్రీహర్ష పెద్దపల్లి కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఒడిశా రాష్ర్టానికి చెందిన సిక్తా పట్నాయక్ 1987లో జన్మించారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఆమె హనుమకొండ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. కాగా రెండ్రోజుల్లో ఆమె కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.