అమరచింత, ఏప్రిల్ 2 : రేషన్‌కార్డులు ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పం పిణీ చేయాలని నిర్ణయించి ఉగాది రోజు సీ ఎం రేవంత్‌రెడ్డి హుజురాబాద్‌లో సన్నబి య్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. మండల కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో స న్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మక్తల్ ఎ మ్మెల్యే వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ప్రా రంభం చేసిన తర్వాతనే మిగిలిన డీలర్లు తమ రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాల ని ఆత్మకూర్, అమరచింత మండలాల తాసీల్దా ర్లు రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో చాలా వరకు రేషన్ షాపులు తెరవకపోగా కొన్ని చో ట్లా తెరిసినా వెంటనే సంబంధిత డీలర్లు తాసీల్దార్ ఆదేశాలు సూచించడంతో మూసి వేశారు. కానీ రె క్కాడితే కానీ డొక్కాడని పేదలు ప్రభుత్వం ఇచ్చే రేష న్ బియ్యం కోసం చాలా చోట్ల రేషన్ బియ్యం కోసం షాపుల ముందు పడిగాపులు కాశారు. సంబంధిత డీలర్లను అడిగితే ఎమ్మెల్యే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన తర్వాతే బియ్యం ఇస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే ప్రారంభించే వరకు మే ము ఉపవాసం ఉండాలంటూ తీవ్ర అసహనం వ్య క్తం చేశారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైర ల్ కావడంతో అమరచింత తాసీల్దార్ రవికుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో శ్రీకృష్ణనగర్లోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఆత్మకూర్ మండలంలోని పలు గ్రామాలకు స్టాక్ ఫాయింట్ నుంచి రేషన్‌షాప్‌లకు సన్నబియ్యం రాలేదు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఖానాపూర్‌లో రేషన్ షాపులో తాసీల్దార్ షేక్చాంద్పాషా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బియ్యం పంపిణీని ప్రారంభించారు.