నాగర్కర్నూల్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : సూర్య ప్రతాపం పెరిగిపోయింది. మరో ఐదురోజుల పా టు తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు వారాలుగా పగటి పూట ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సాధారణానికి మించి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తప్పనిసరి పనిపై వచ్చే ప్రజలు గొడుగులు పట్టుకొని, టవళ్లు, టోపీలు, మహిళలైతే చీరకొంగులు తలపై కప్పుకొని రోడ్డెక్కుతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వడగాల్పులు వీ స్తూ సాయం త్రం 7 గంటల వరకూ ఎండ ప్రభావం ఉంటోంది. రోడ్ల వెంట టోపీలు, మట్టి కుండలు, కూలింగ్ అద్దాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలను తాగుతున్నా రు. ఉదయం 12గంటలలోపే పనులు ముగించుకొని ఇండ్లకు రావాలని, సాయం త్రం 4 గంటల త ర్వాత బ యటికి వెళ్లడం శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండాకాలంలో అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్లాలి. అప్పుడు కూడా సరైన జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వడదెబ్బ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఎండలు అధికంగా ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు ఇండ్లల్లోనే చల్లటి ప్రదేశంలో ఉండాలి. కూల్డ్రింక్స్ కంటే మజ్జిగ, కుండలోని నీళ్లు, కొబ్బరిబొండాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వదులైన, కాటన్ దుస్తులు ధరించాలి.
అలంపూర్, ఏప్రిల్ 4 : నడిగడ్డలో ఊష్ణోగ్రత లు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఉదయం పూటే పనులు ముగించుకుంటున్నారు. దీంతో మధ్యాహ్నం వేళ రహదారుల న్నీ నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. రాబోవు రోజుల్లో ఎండ వేడిమి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.