అచ్చంపేట, మే 21 : దేశంలో రెండో అతిపెద్దదైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) అటవీ ప్రాంతం జీవవైవిధ్యాన్ని కలిగిఉన్నది. నల్లమల అటవీ ప్రాంతం విభిన్న రకాల జంతుజాలానికి ని లయం. ఇది ముఖ్యమైన జీవవైవిద్య జోన్‌గా మా రింది. ఆకురాల్చే అడవులు, గడ్డి భూములు కలిగి ఉన్నది. టేకు, రోజ్‌వుడ్, వెదురు, గూస్బెర్రీ, కినో చెట్లు అధికంగా ఉంటాయి. అమ్రాబాద్ టైగర్ రిజ ర్వ్ ఫారెస్ట్ చుట్టూ ఎత్తైన కొండలు, లోయలు, కృష్ణానది, జనసంచారానికి అవకాశాలు అంతగా లేకపోవడంతోపాటు బఫర్‌జోన్ అధికంగా ఉండడం తో ఏటీఆర్ నల్లమల ప్రాంతం వన్యప్రాణులకు సేఫ్‌జోన్‌గా మారింది. 25 పెద్దపులులు ఉండగా.. అందులో 12 కపుల్స్ ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీటిలో నాలుగు పెద్ద పులులు పొ రుగు రాష్ట్రాల నుంచి వచ్చినట్లు అంచనా.
అటవీశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యల తో శాఖాహార జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విస్తారమైన గడ్డి క్షేత్రాలు, తాగునీటి కోసం సాసర్పిట్లు, ఊటకుంటలు, సోలార్‌బోర్లు ఏర్పాటు చేయడం కలిసివచ్చింది. శాఖాహార జంతువులను వెంటాడి తినే చిరుతలు, పులుల సంఖ్య కూడా పె రుగుతున్నది. చుక్కల దుప్పులు, సాంబార్, నీల్గాయి, గడ్డిజింక, అడవిపందులు, బిట్టు ఉడతలు, కొండముచ్చులు, నక్కలు, నాలుగు కొమ్ముల జింక లు, కృష్ణజింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు, మనుబోతులు, రేస్‌కుక్కలు, కొండగొర్రెలు, మూషికజింకలు, ముంగీసలు, మరునాగులు, అడవిపిల్లులు శాఖాహార జంతువుల కిందకువస్తాయి. కాగా, ఏటీఆర్ పరిధిలో ఏటా మాదిరిగానే ఈసారి కూడా అధికారులు శాఖాహార జంతువుల గణనను మంగళవా రం ప్రారంభించారు. ఈ నెల 23 వరకు మూడు రోజుల పాటు సర్వే కొనసాగనున్నది. నేషనల్ టైగ ర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ న్యూఢిల్లీ ఆదేశాల మేర కు మన్ననూర్, అమ్రాబాద్, మద్దిమడుగు, దోమలపెంట రేంజ్‌ల పరిధిలోని 140 బీట్లలో సర్వే ప్రారంభించారు. ప్రతి బీట్‌లో ఒక స్ట్రీట్‌లైన్ ద్వారా ఇద్దరు వ్యకులు రెండు కిలోమీటర్ల మేర మొబైల్ డే టా ఫొటో షూటింగ్ సర్వే జరుపుతున్నారు. ఇందుకుగానూ 60 మంది బీట్ అధికారులు, 30 మంది శిక్షణ అధికారులు, 13 మంది నేచర్ గైడ్స్తోపాటు వాచర్లు, డ్రై వర్లకు శిక్షణ ఇచ్చారు. ఉదయం 6 నుంచి సాయం త్రం 6 గంటల వరకు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లి సర్వే చేపడుతున్నారు.కనిపించిన శాఖాహార వన్యప్రాణులు, పక్షులు ఇతర వాటన్నింటిని ఫొటో తీసి ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. వన్యప్రాణుల వృద్ధి కోసం చేపట్టాల్సిన చర్య లు, వనరుల కోసం సర్వే దోహదపడనున్నది. మూ డ్రోజులపాటు జరిగే ఈ గణనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్‌గోపిడి పేర్కొన్నారు. గణన పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామన్నారు.