గద్వాల, జూలై 18 : జూరాలకు మరోసారి వరద పోటెత్తింది. గత కొన్ని రోజులుగా శాంతించిన కృష్ణమ్మ ఒకే సారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు మరోసారి జలకళ సంతరించుకుంది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ మ్మ పరుగులు తీస్తూ జూరాలవైపు వస్తుం ది. జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం ఇన్‌ఫ్లో 1,15000వేల క్యూసెక్కుల వరద రాగా అధికారులు 18 గేట్లు 71,604 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చే స్తున్నారు. అదేవిధంగా విద్యుదుత్పత్తికి 30,498 క్యూసెక్కులు, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్-1కు 650, భీమా లిఫ్ట్-2కు 750, కోయిల్‌సాగర్‌కు 315, జూరా ల ప్రధాన కుడి కాల్వకు 600, ఎడమ కాల్వకు 1030, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు మొత్తం ఇన్‌ఫ్లో 1,15000 క్యూ సెక్కుల వరద వస్తుండగా అవుట్‌ఫ్లో 1,06,213 క్యూసెక్కులు నమోదైంది. కాగా జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.971టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
రాజోళి, జూలై 18 : తెలంగాణ సరిహద్దులో రాజోళి వద్ద ఉన్న సుంకేసుల ప్రా జెక్టు జలకళను సంతరించుకున్నది. శుక్రవారం టీఎం డ్యాం నుంచి 41వేల క్యూసెక్కులు రావడంతో ప్రాజెక్టులో 9 గేట్లు ఒక మీటరు మేర ఎత్తి దిగువకు 39,411 క్యూ సెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ మహేందర్‌రెడ్డి తెలిపా రు. అలాగే కేసీ కెనాల్‌కు 41,765 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.